రేపే కర్ణాటక అసెంబ్లీ.. ఎవరు విన్నర్ ?

కర్ణాటక అసెంబ్లీలో సోమవారం మళ్ళీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయా ? సీఎం కుమారస్వామి సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో.. తిరిగి హై డ్రామాకు సభ్యులు తెర తీయనున్నారా ? రేపు కూడా బలపరీక్ష జరగడం అనుమానమేనని బీజేపీ ఇప్పటికే సందేహాలు లేవనెత్తుతోంది. అంటే.. కుమారస్వామి మెజారిటీ నిరూపణను ఏదో విధంగా అడ్డుకోవడమే కమలం పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బల పరీక్షలో తన ప్రభుత్వ కూటమి నెగ్గడం ఖాయమని కుమారస్వామి ధీమాగా […]

రేపే కర్ణాటక అసెంబ్లీ.. ఎవరు విన్నర్ ?

Edited By:

Updated on: Jul 22, 2019 | 6:27 AM

కర్ణాటక అసెంబ్లీలో సోమవారం మళ్ళీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయా ? సీఎం కుమారస్వామి సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో.. తిరిగి హై డ్రామాకు సభ్యులు తెర తీయనున్నారా ? రేపు కూడా బలపరీక్ష జరగడం అనుమానమేనని బీజేపీ ఇప్పటికే సందేహాలు లేవనెత్తుతోంది. అంటే.. కుమారస్వామి మెజారిటీ నిరూపణను ఏదో విధంగా అడ్డుకోవడమే కమలం పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బల పరీక్షలో తన ప్రభుత్వ కూటమి నెగ్గడం ఖాయమని కుమారస్వామి ధీమాగా ఉన్నప్పటికీ.,. రోజుకొక రకంగా జరుగుతున్న పరిణామాలు ఆయనను కలవరపెడుతున్నాయి. స్పీకర్ రమేష్ కుమార్ తన సర్కార్ ని గట్టెకించ గలరని ఆయన నమ్ముతున్నా… .. 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను తప్పనిసరిగా సభకు హాజరు కావాలని తాము బలవంతపెట్టలేమన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఆయన వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. పార్టీ విప్ ను వారు ధిక్కరించవచ్ఛునని భయపడుతున్నారు. కాగా-కర్ణాటకలో ఎవరి బలం ఎంతో రేపు తేలుతుందని మాజీ సీఎం, బీజేపీ నేత యెడ్యూరప్ప అన్నారు. సోమవారం సీఎం కుమారస్వామి బలపరీక్షకు సిధ్దపడుతున్న నేపథ్యంలో ఆదివారం యెడ్యూరప్ప… హోటల్ రమడలో.. తమ పార్టీవారితో సమావేశమయ్యారు. రాజీనామా చేసిన 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను ఓటింగ్ విషయంలో బలవంతపెట్టరాదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్, జేడీ-ఎస్ తమ పార్టీ సభ్యులకు జారీ చేసే విప్ కు విలువలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. విశ్వాస పరీక్షకు ఇక ఒక్కరోజు సమయం మాత్రమే ఉండడంతో.. కాంగ్రెస్, జేడీ-ఎస్ సభ్యులు కూడా సభలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. రెబల్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోని ఉచితానుచితాలపై వారు చర్చలు జరిపారు.

విప్ జారీ చేసినప్పటికీ ఈ తిరుగుబాటు సభ్యులు సభకు హాజరు అవుతారా అన్నది సందేహాస్పదమేనని పలువురు అభిప్రాయపడ్డారు.
తాము గత శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా.. ఈ పిటిషన్ పై పట్టుబట్టాలా, వద్దా అని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జన పడుతోంది. ఈ ఉత్తర్వులు రాజ్యాంగంలోని పదో షెడ్యూలు (పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం) కు వ్యతిరేకంగా ఉన్నాయని, అందువల్ల ఆ ఉత్తర్వులపై క్లారిఫికేషన్ కోరాలో .. లేక మౌనం వహించాలో తెలియడంలేదని ఓ కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. మాజీ సీఎం, సీఎల్ఫీ నేత కూడా అయిన సిద్ధరామయ్య.. ఆదివారం ఇదే విషయమై చర్చించేందుకు పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హోటల్ తాజ్ వివంటలో ఈ భేటీ జరిగింది. అటు-కుమారస్వామి కూడా తమ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. మరోవైపు..సీనియర్ కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి..జేడీ-ఎస్ జాతీయ అధ్యక్షుడు మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రేపు అసెంబ్లీలో తాము అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.