నదిలో కుప్పలు తెప్పలుగా తేలుతూ కనిపించిన ఆధార్ కార్డులు.. ఇంతకీ ఎవరి పని?

కర్ణాటకలోని మంగళూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నది ఒడ్డున ఆధార్ కార్డుల కుప్పలు తెప్పలుగా కనిపించాయి. నది ఒడ్డుకు వచ్చిన సందర్శకులు కార్డులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించి పంచాయతీ అధ్యక్షుడికి సమాచారం అందించారు. దీంతో చెరువు వద్దకు చేరుకున్న పంచాయతీ సిబ్బంది అక్కడి నుండి వందలాది ఆధార్ కార్డులను సేకరించారు.

నదిలో కుప్పలు తెప్పలుగా తేలుతూ కనిపించిన ఆధార్ కార్డులు.. ఇంతకీ ఎవరి పని?
Aadhaar Cards In Netravati River

Updated on: Mar 05, 2026 | 7:18 PM

కర్ణాటకలోని మంగళూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నది ఒడ్డున ఆధార్ కార్డుల కుప్పలు తెప్పలుగా కనిపించాయి. నది ఒడ్డుకు వచ్చిన సందర్శకులు కార్డులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించి పంచాయతీ అధ్యక్షుడికి సమాచారం అందించారు. దీంతో చెరువు వద్దకు చేరుకున్న పంచాయతీ సిబ్బంది అక్కడి నుండి వందలాది ఆధార్ కార్డులను సేకరించారు. పోస్టల్ శాఖ సరైన చిరునామాల లేనివారి ఆధార్ కార్డులను అందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఫరంగిపేట, పుడు గ్రామంలోని నేత్రావతి నది ఒడ్డున వందలాది ఆధార్ కార్డులు కనిపించాయి. సమాచారం అందుకున్న వెంటనే పంచాయతీ అధ్యక్షుడు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక నివాసితులతో కలిసి నది ఒడ్డున ఉన్న ఆధార్ కార్డులను సేకరించారు. ఈ సంఘటనపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టల్ శాఖ ఆధార్ కార్డులను సరైన చిరునామాలకు అందించడం లేదని, అందుకే ఈ కార్డులు నది ఒడ్డున వదిలివేశారని ఆరోపించారు.

నేత్రావతి నది ఒడ్డున వందలాది మంది గ్రామస్తుల పోస్ట్ కార్డులు కూడా కనిపించాయి. తమ చిరునామాలు, పేర్లు మార్చడానికి డబ్బు చెల్లించిన గ్రామస్తులు తమ కొత్త కార్డులు వచ్చే వరకు వేచి చూస్తున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ నదిలో తేలుతూ కనిపించాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని మండిపడుతున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన మార్చి 3న జరిగింది. ఈ సంఘటన తర్వాత, గ్రామస్తులు పోస్టల్ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే యు.టి. ఖాదర్, యుఐడిఎఐ ప్రాజెక్ట్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నది ఒడ్డున ఇంత పెద్ద సంఖ్యలో ఆధార్ కార్డులు కనుగొనటానికి కారణం ఏమిటి? దీనికి ఎవరు బాధ్యులు అని ఆయన నిలదీశాడు. దీంతో ఆయన దర్యాప్తునకు ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us