కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర రాజకీయ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా.. రాష్ట్రంలో ఇంకా హిజాబ్ నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకోలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మైసూరు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదివరకే ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చానన్నారు. హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని ఆలోచించామని, దీనిపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
శుక్రవారం మైసూరులో మాట్లాడిన సీఎం సిద్ధరామయ్య.. రాష్ట్రంలో హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం తొలగించబోతోందని, ఇందుకోసం పరిపాలనపరమైన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే తనకు నచ్చిన దుస్తులు ధరించడం, ఆహారాన్ని ఎంచుకోవడం వ్యక్తిగత విషయమని కూడా ఆయన అన్నారు.
On lifting the ban on hijab in Karnataka, CM Siddaramaiah says, "I have said this in response to a question. We have not done it yet. We are thinking of withdrawing the decision (of hijab ban). We will discuss it. " pic.twitter.com/BHM3wLdGKS
— ANI (@ANI) December 23, 2023
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విభజించి పాలించు అనే బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోందని, తరగతి గదుల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సీఎం సిద్ధరామయ్య మతం విషం చిమ్ముతున్నారని బీజేపీ ఆరోపించింది.
హిజాబ్ బ్యాన్ ఆర్డర్ ఉపసంహరణకు సంబంధించి సీఎం చేసిన ప్రకటనను కర్ణాటక రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి సమర్థించారు. సీఎం స్టాండ్.. పార్టీ స్టాండ్ అని, సీఎం సిద్ధరామయ్య వెంటే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశంపై దావణగెరెలో మంత్రి ఎస్‌ఎస్ మల్లికార్జున స్పందిస్తూ, సీఎం సిద్ధరామయ్య ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. సమాజంలో సంప్రదాయాలను గౌరవిస్తూ.. హిజాబ్ నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటామని సీఎం చేసిన ప్రకటన సరైనదేనన్నారు.
మాండ్యాలో హిజాబ్‌ను తిరిగి తీసుకురావాలని సీఎం చేసిన ప్రకటనను పీఈఎస్ కళాశాల ముస్లిం విద్యార్థులు స్వాగతించారు. ఇస్లాంలో హిజాబ్ ధరించాలనే నిబంధన ఉందన్నారు. అందుకే దానిని ధరించాలని, హిజాబ్ ధరించకుండా బయటకు వెళ్లలేమన్నారు విద్యార్థులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…