Chennai: సమయానికి దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలు పణంగా పెట్టి..!

పక్కవాళ్లు ఏమైపోతే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో ఓ యువకుడు తన ప్రాణాలకు తెగించి ఓ విద్యార్థిని రక్షించాడు. రోడ్డుపై మలిచిన నీటిలోంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ విద్యార్థి కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. అది గమనించిన అటుగా వెళ్తున్న ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆ విద్యార్థిని రక్షించాడు.

Chennai: సమయానికి దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలు పణంగా పెట్టి..!
Man Saves Student

Updated on: Apr 20, 2025 | 1:38 PM

వివరాల్లోకి వెళితే…

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఓ 3వ తరగతి విద్యార్థి రోజులానే స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. కానీ ఆరోజు వర్షం పడడంతో అతను వెళ్లే దారిలో భారీగా నీళ్లు మలిచాయి. ఇక వేరే దారి లేఖ, ఆ విద్యార్తి నీటిలోంచే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇంతలో సమీపంలోని జంక్షన్ బాక్స్ నుంచి ఓ కరెంట్ వైర్ తెగి ఆ బాలుడు నడుస్తున్న నీటిలో పడిపోయింది. దాంతో ఆ బాలుడు షాక్‌కు గురయ్యాడు. విద్యార్థి నీటిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా అటు వైపుగా వెళుతున్న వారు ఎవరూ రక్షించడానికి ముందుకు రాలేదు. కానీ అదే దారిలో వెళ్తున్న “కన్నన్‌” అనే యువకుడు నీటిలో పడిపోయి ఉన్న విద్యార్తిని గమనించాడు. వెంటనే బైక్‌ను వదిలేసి ప్రాణాలకు తెగించి ఆ విద్యార్థిని నీటిలోంచి బయటకు తీసుకొచ్చాడు. తర్వాత హాస్పిటల్‌కు తరలించాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారందరూ ఆ యువకుడు చేసిన ధైర్యసాహసాన్ని అభినందిస్తున్నారు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…