‘భారమైన హృదయంతో’, ముంబైని వీడిన కంగనా,

అయిదు రోజులపాటు ముంబైలో  గడిపిన కంగనా రనౌత్ సోమవారం ఉదయం తన స్వస్థలమైన మనాలీకి బయల్దేరి వెళ్ళింది. వెళ్లే ముందు..భారమైన హృదయంతో ఈ నగరాన్ని వీడుతున్నానని ట్వీట్ చేసింది..

భారమైన హృదయంతో, ముంబైని వీడిన కంగనా,

Edited By:

Updated on: Sep 14, 2020 | 11:50 AM

అయిదు రోజులపాటు ముంబైలో  గడిపిన కంగనా రనౌత్ సోమవారం ఉదయం తన స్వస్థలమైన మనాలీకి బయల్దేరి వెళ్ళింది. వెళ్లే ముందు..భారమైన హృదయంతో ఈ నగరాన్ని వీడుతున్నానని ట్వీట్ చేసింది. ఇన్ని రోజులూ ఇక్కడ తనను ఎన్ని భయభ్రాంతులకు గురి చేశారో, ఎన్ని దుర్భాషలాడారో, తన ఆఫీసును ఎలా కూలగొట్టారో చూస్తే, ఇది పాక్ ఆక్రమిత కాశ్మీరే అన్న తన కామెంట్ మరింత పెద్ద ‘శబ్దం’ గా,  ‘విస్ఫోటనం’ గా మారిందో అర్థమవుతోందని ఆమె పేర్కొంది. శివసేనకు, కంగనా కు మధ్య తలెత్తిన పెను ‘తుపాను; ముఖ్యంగా మహారాష్ట్రను కుదిపివేసింది.  ముంబైలోని ఈమె ఇంట్లో కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని తాజాగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన నోటీసు ఈ ‘ మహా’ ఎపిసోడ్ లో చివరి పరాకాష్ట !