యూపీలో జర్నలిస్ట్ కాల్చివేత, ముగ్గురు దుండగుల అరెస్ట్

యూపీలోని బలియా జిల్లాలో 42 ఏళ్ళ రతన్ సింగ్ అనే జర్నలిస్టును దుండగులు వెంటబడి మరీ కాల్చి చంపారు. ఆస్తి వివాదమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.

యూపీలో జర్నలిస్ట్ కాల్చివేత, ముగ్గురు దుండగుల అరెస్ట్

Edited By:

Updated on: Aug 25, 2020 | 10:31 AM

యూపీలోని బలియా జిల్లాలో 42 ఏళ్ళ రతన్ సింగ్ అనే జర్నలిస్టును దుండగులు వెంటబడి మరీ కాల్చి చంపారు. ఆస్తి వివాదమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. రతన్ సింగ్  బైక్ పై తన గ్రామానికి వెళ్తుండగా  ముగ్గురు వ్యక్తులు అతడిని వెంబడించారని, ఈ జర్నలిస్ట్ తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించగా కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. అయితే రతన్ సింగ్ తండ్రి మాత్రం ఆస్తి వివాదమేమీ లేదని, పోలీసులు కట్టుకథ అల్లుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులనూ పోలీసులు అరెస్టు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..రతన్ సింగ్ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు. నిందితులపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.