జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ రీ ఓపెన్… విద్యార్థులు యూనివర్సిటీకి రావాలంటే ఆ నిబంధనను పాటించాలి…

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ డిసెంబర్ 21న పున:ప్రారంభం కానుంది. విద్యార్థుల కోసం యూనివర్సిటీని రీ ఓపెన్ చేస్తున్నట్లు జేఎన్‌యూ నిర్వాహకులు ప్రకటించారు.

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ రీ ఓపెన్... విద్యార్థులు యూనివర్సిటీకి రావాలంటే ఆ నిబంధనను పాటించాలి...

Edited By:

Updated on: Dec 19, 2020 | 6:14 PM

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ డిసెంబర్ 21న పున:ప్రారంభం కానుంది. విద్యార్థుల కోసం యూనివర్సిటీని రీ ఓపెన్ చేస్తున్నట్లు జేఎన్‌యూ నిర్వాహకులు ప్రకటించారు. అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో యూనివర్సిటీలో ప్రవేశించడానికి ముందు విద్యార్థులు సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉండాలని పేర్కొన్నారు. బయటి నుంచి వచ్చే విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఏడు రోజులపాటు సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉండాలని సూచించారు. సెల్ఫ్ క్వారెంటైన్ పూర్తి చేసుకున్న వారినే క్యాంపస్‌లోకి ప్రవేశించేందుకు అనుమతిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us