Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి కోర్టులో మరోసారి షాక్.. పరువునష్టం దావా కేసులో వ్యక్తిగత హాజరు నుంచి..

|

May 03, 2023 | 5:54 PM

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రాహుల్‌గాంధీకి మరోసారి చుక్కెదురయ్యింది. జార్ఖండ్‌ లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్‌ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. పరువునష్టం దావా కేసులో వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలన్న రాహుల్‌ పిటిషన్‌ను ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు కొట్టేసింది. తమ సామాజిక వర్గాన్ని రాహుల్‌గాంధీ కించపర్చారని ప్రదీప్‌ మోడీ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్‌ వేశారు.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి కోర్టులో మరోసారి షాక్.. పరువునష్టం దావా కేసులో వ్యక్తిగత హాజరు నుంచి..
Rahul Gandhi
Follow us on

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్‌ గాంధీకి కోర్టులో మరోసారి షాక్ తగిలింది. పరువునష్టం దావా కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాంచీ కోర్టులో రాహుల్‌ పిటిషన్‌
పిటిషన్‌ను కొట్టేసింది ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు.  రాంచీలో ‘మోదీ ఇంటిపేరు కేసులో’ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించారు. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ కేసులో వ్యక్తిగత హాజరు కావాలంటూ దాఖలైన పిటిషన్‌ను రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బుధవారం (మే 3) తిరస్కరించింది.

రాంచీలో ప్రదీప్ మోదీ అనే వ్యక్తి తరఫున రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పుష్పా సిన్హా వాదించారు. అదే సమయంలో రాహుల్ గాంధీ తరపున న్యాయవాది ప్రదీప్ చంద్ర వాదించారు.

రాహుల్ గాంధీ గుజరాత్‌లోని సూరత్ కోర్టు నుంచి పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష విధించినప్పుడు పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం