ఆన్ లైన్ ద్వారా నటి శ్రధ్ధాకపూర్ కి తానే సీబీడీ ఆయిల్ అనే డ్రగ్ ని ఆర్డర్ చేశానని సుశాంత్ మాజీ మేనేజర్ జయా సాహా తెలిపింది. సుశాంత్, కమ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనను ఇంటరాగేట్ చేసిన సందర్భంగా ఈమె సుశాంత్ కి ఎలా .ఈ డ్రగ్ ఇవ్వాలో రియాచక్రవర్తికి వాట్సాప్ ద్వారా వివరంగా తెలియజేశానని వెల్లడించింది. సుశాంత్ తాగే టీ లో నాలుగైదు చుక్కలు కలిపి దీన్ని ఇవ్వాలని, అలా అరగంటకోసారి ఇస్తుండాలని సూచించానని జయా సాహా తెలిపింది. అయితే శ్రధ్ధాకపూర్ కి మాత్రం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని సాహా పేర్కొంది. ఇలా ఉండగా బాలీవుడ్ లో ఇంకా ఎంతమంది ‘డ్రగ్గిస్టులు’ ఉన్నారో ఎన్సీబీ అధికారులు ఇదివరకే జాబితా రూపొందించారు. వారికి త్వరలో సమన్లు పంపనున్నారు.