Jammu Kashmir Terror Attack: భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) జమ్మూ, కశ్మీర్ పర్యటనకు ముందు ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నం శుక్రవారం విఫలమైంది. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అనుమానిత పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారు. కాగా, ఈ ఘటనలో ఓ సీఐఎస్‌ఎఫ్ అధికారి కూడా వీరమరణం పొందారు. వార్తా సంస్థ ANI ఈ దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇందులో CISF సిబ్బంది బస్సు సుంజువాన్ ప్రాంతం గుండా వెళుతున్నట్లు కనిపిస్తుంది. కొంత సేపటికి ఒక బైక్ రైడర్ అటుగా వెళుతున్నప్పుడు పేలుడు శబ్ధం వినబడడం మొదలవుతుంది. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి.
కాగా, జమ్మూ శివార్లలోని సుంజ్వాన్‌లోని ఆర్మీ క్యాంపు సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. సాంబ జిల్లా పల్లి పంచాయతీలో ఆదివారం ప్రధాని పర్యటన జరగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతమంతా రెడ్ అలర్ట్ ప్రకటించడం గమనార్హం. డీజీపీ దిల్‌బాగ్ సింగ్, ఎన్‌కౌంటర్ ప్రదేశాన్ని సందర్శించిన తరువాత, ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆధారిత జైష్ ఎ మహ్మద్ ఆత్మాహుతి దళంలో భాగమేనని, వారు దేశంలోకి చొరబాటుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ప్రధానమంత్రి మోడీ జమ్మూ, కశ్మీర్ పర్యటనకు అంతరాయం కలిగించడానికి పెద్ద కుట్ర పన్నినట్లు డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.
#WATCH CCTV footage of the terrorist attack on the bus carrying CISF personnel in the Sunjwan area of Jammu early yesterday
(Source unverified) pic.twitter.com/2TUzFIupZy
— ANI (@ANI) April 23, 2022
ఎన్‌ఐఏ, రాష్ట్ర దర్యాప్తు సంస్థ సంయుక్త బృందం ఎన్‌కౌంటర్ స్థలాన్ని సందర్శించింది. ఈ కేసు విచారణకు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు నుండి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులు గురువారం జమ్మూ నగర శివార్లలోకి ప్రవేశించి ఆర్మీ క్యాంపు సమీపంలోని ప్రాంతంలో మకాం వేశారు. ఎన్‌కౌంటర్ స్థలం దగ్గర పోలీసులు, ఇతర బలగాలు ఆపరేషన్‌లో పాల్గొన్నాయని, అది పూర్తయిందని డీజీపీ తెలిపారు.
స్థానిక అదికారుల కథనం ప్రకారం, ఉగ్రవాదులు ఇద్దరూ జెఎమ్ ఆత్మాహుతి దళంలో భాగం, ఇది భద్రతా దళాల శిబిరాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ నుండి చొరబాటుకు యత్నించారు. ఉగ్రవాదులిద్దరూ ఆత్మాహుతి జాకెట్లు ధరించి ఉన్నారని, వారి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇంతలో 15 మంది సైనికులతో కూడిన సీఐఎస్ఎఫ్ బస్సు జమ్మూ విమానాశ్రయం వైపు వెళుతోంది. దీని తర్వాత అకస్మాత్తుగా ఇద్దరు ఉగ్రవాదులు బస్సుపైకి గ్రెనేడ్ విసిరి, బస్సుపై కాల్పులు జరిపి పారిపోయారు. ఆ తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరిపి గ్రెనేడ్ విసిరారని సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి తెలిపారు. ఈ దాడిలో, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) SP పాటిల్ వీరమరణం పొందగా, బస్సులో కూర్చున్న మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. భద్రతా బలగాలు కూడా ధీటుగా సమాధానమిచ్చాయి.
Read Also…. Edible Oil Price: షాకింగ్ న్యూస్.. భారీగా పెరనున్న వంటనూనె ధరలు.. ఆ దేశం తీసుకున్న నిర్ణయంతో..
మరిన్ని జాతీయ వార్తల కోసం…