Jammu Congress workers – Ghulam Nabi Azad: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ దిష్టి బొమ్మను జమ్మూ కాశ్మీర్ ఆపార్టీ కార్యకర్తలు దగ్ధం చేశారు. జమ్మూలో ఆజాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఇటీవలనే రాజ్యసభ నుంచి గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజాద్ చేసిన సేవలను గుర్తిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆజాద్ జమ్మూలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేతలంతా గులాం నబీ ఆజాద్‌కు సన్మానం సైతం చేశారు. ఈ సందర్భంగా మోదీపై గులాం నబీ ఆజాద్ ప్రశంసలు కురిపించారు.
అయితే ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయి పదవిలో ఉన్న ఆజాద్ ఇప్పుడు ఆ పార్టీకి మద్దతు ఇవ్వకపోవడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. గులాం నబీ ఆజాద్ తీరును ఖండిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం జమ్మూలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీతో ఆజాద్ దోస్తీ కట్టి ప్రశంసిస్తున్నారంటూ ఆరోపించారు. దీనిలో భాగంగా ఆయన డీడీసీ ఎన్నికల ప్రచారానికి కూడా కాశ్మీర్‌కు రాలేదని, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిన సమయంలో మోదీని ప్రశంసిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. గులాం నబీ ఆజాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కశ్మీరీలు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం పట్ల ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
సోమవారం జమ్ములో మాట్లాడిన గులాంనబీ ఆజాద్ దేశంలోని చాలా మంది నాయకులంటే తనకిష్టమని తెలిపారు. తాను ఓ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి జాతీయస్థాయి నేతగా ఎదగడం తనకు ఎంతో గర్వంగా అనిపిస్తుందన్నారు. మన దేశ ప్రధాని మోదీ కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారని.. ఆయన రాజకీయాల్లోకి రాకముందు టీ అమ్మేవారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానిని ప్రశంసిస్తూ మాట్లాడారు.
Also Read: