సోన్‌మార్గ్‌ Z-మోర్ టన్నెల్ ప్రారంభోత్సవంపై ఒమర్ అబ్దుల్లా పోస్ట్.. ప్రధాని మోదీ రిప్లై ఇదే!

|

Jan 11, 2025 | 8:52 PM

సోన్‌మార్గ్‌లోని జెడ్‌-మోర్ టన్నెల్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ జనవరి 13న జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. అధికారులతో సమీక్షించిన సీఎం, సోషల్ మీడియా X లో ఒక పోస్ట్‌ను కూడా పంచుకున్నారు. ఈ పోస్ట్‌పై స్పందిస్తూ, ప్రధాని మోదీ తన పర్యటన గురించి ఆసక్తికర కామెంట్ చేశారు.

సోన్‌మార్గ్‌ Z-మోర్ టన్నెల్ ప్రారంభోత్సవంపై ఒమర్ అబ్దుల్లా పోస్ట్.. ప్రధాని మోదీ రిప్లై ఇదే!
Omar Abdullah , Pm Modi
Follow us on

శ్రీనగర్-లడఖ్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా సోన్‌మార్గ్‌లోని జెడ్‌-మోర్ టన్నెల్‌ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఆయన రాక కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోనామార్గ్‌లో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. దీని తరువాత, X లో పోస్ట్ చేస్తూ.. టర్నెల్ ప్రారంభోత్సవం తర్వాత, సోనామార్గ్ ఏడాది పొడవునా పర్యాటకం కోసం తెరిచి ఉంటుంది. ఇది ప్రపంచ స్థాయి స్కీ రిసార్ట్‌గా అభివృద్ధి చెందుతుందని వ్రాశారు. దీంతో, శీతాకాలంలో వలసలు నిలిచిపోనున్నట్లు పేర్కొన్నారు

సోన్‌మార్గ్‌లోని జెడ్‌-మోర్ టన్నెల్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దు్ల్లా.. రాజకీయ విభేదాలు మరిచి ప్రధాని రాకకు సన్నాహాలు ఎలా జరుగుతున్నాయనే అంశాన్ని పరిశీలించారు. ప్రధాని పర్యవేక్షణలో కాశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధిని కూడా ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఒమర్ అబ్దుల్లా తన సోన్‌మార్గ్‌లోని కొన్ని క్షణాలను ట్విట్టర్ X ద్వారా పోస్ట్ చేసి, ‘ప్రధానమంత్రి రాక కోసం సోన్‌మార్గ్ ఎంత సిద్ధం అయ్యిందో చూడటానికి నేను అక్కడికి వెళ్లాను. జెడ్‌మోర్‌ సొరంగం ప్రారంభోత్సవంతో సోన్‌మార్గ్‌లో ఏడాది పొడవునా పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దీంతో స్థానికులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఈసారి కార్గిల్, లేహ్ వెళ్లే ప్రయాణ దూరం తగ్గుతుంది.’ అంటూ పేర్కొన్నారు.

కశ్మీర్ ముఖ్యమంత్రి పోస్టుపై స్వయంగా ప్రధానమంత్రి ముగ్ధులయ్యారు. సోషల్ మీడియా ఎక్స్‌లో ఒమర్ అబ్దుల్లా పోస్ట్‌పై స్పందిస్తూ, ప్రధాని మోదీ ఇలా వ్రాశారు, ‘నేను సోన్‌మార్గ్‌కు వెళ్లడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.మీరు ఈ సొరంగం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ, పర్యాటక రంగానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.’ ఇది మాత్రమే కాదు, ఒమర్ అబ్దుల్లా పంచుకున్న వైమానిక ఛాయాచిత్రాలు, వీడియోలను సైతం ప్రధాని ప్రశంసించారు.

జెడ్‌మోర్ సొరంగం ప్రారంభోత్సవానికి సోమవారం(జనవరి 13) ప్రధాని మోదీ కాశ్మీర్‌లో పర్యటించబోతున్నారు. మూడు నెలల క్రితమే ఈ టన్నెల్‌ను నిర్మించారు. చివరగా, ఇది ఓపెనింగ్ అవుతుంది. మరోవైపు కశ్మీర్‌లో మరో టన్నెల్ ప్రాజెక్ట్ జోజిలా టన్నెల్ వచ్చే ఏడాదిలోగా పూర్తి కానుంది.

జనవరి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Z-Morh సొరంగమార్గాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో గండేర్‌బల్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సొరంగం దగ్గర బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు చేశామని, ప్రధానమంత్రి భద్రతా బృందం తన నిఘాలో తీసుకుంది. శ్రీనగర్‌తో పాటు లోయలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సొరంగం సైట్ ఇప్పుడు సాధారణ ప్రజలకు మూసివేశారు. పోలీసులు, పారామిలిటరీ బలగాలు, సైన్యం పెట్రోలింగ్ ప్రారంభించాయి.

Z-Morh టన్నెల్ ప్రారంభోత్సవం జమ్మూ – కాశ్మీర్ అభివృద్ధికి ఒక పెద్ద అడుగుగా పరిగణిస్తున్నారు. ఇది సోనామార్గ్‌లో పర్యాటకాన్ని పెంచడమే కాకుండా స్థానిక ఉపాధి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. జనవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ ఈ సొరంగమార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారని గతంలో చెప్పారు. అయితే తరువాత అధికారులు స్వయంగా శ్రీనగర్‌కు వచ్చి ప్రారంభిస్తారని ప్రకటించారు ప్రధాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) జనవరి 12న లోయకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

ఈ సొరంగం జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగానికి ఒక వరంగా మారుతుందని భావిస్తున్నారు. శీతాకాలంలో లోయ మంచుతో కప్పబడి ఉంటే, సోనామార్గ్ చేరుకోవడం అసాధ్యం. ఈ సొరంగం ఏడాది పొడవునా సోనామార్గ్‌ను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, శీతాకాలంలో కూడా ఈ ప్రదేశం సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులకు అవకాశం కల్పిస్తుంది. సొరంగం స్థానిక ప్రజలకు కొత్త ఉపాధి అవకాశాలను కూడా తెరుస్తుంది. ఇది కాకుండా, కాశ్మీర్ ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఈ ప్రాజెక్ట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఈ సొరంగం భారత సైన్యం, ఇతర రక్షణ దళాలకు ముఖ్యమైన లింక్ అవుతుంది. దీని ద్వారా దేశ ఉత్తర సరిహద్దుకు సైనిక పరికరాలు, సైనికుల ప్రవేశం సులభతరం కానుంది. ప్రతికూల వాతావరణంలో కూడా సైన్యానికి ఈ సొరంగం సురక్షితమైన మార్గం. అధికారుల ప్రకారం, ఈ సొరంగం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సైన్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..