జలియన్ వాలా బాగ్ బిల్లుకు మోకాలడ్డిన కాంగ్రెస్

|

Jul 09, 2019 | 12:05 PM

లోక్ సభలో జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ (సవరణ) బిల్లు ప్రవేశాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ నిర్వహిస్తున్న ట్రస్టుకు శాశ్వత సభ్యుడుగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుని తొలగింపునకు ఉద్దేశించిన బిల్లు ఇది. సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ బిల్లును ప్రవేశ[పెట్టారు. ట్రస్టీ గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండాలన్నపదాన్ని తొలగిస్తూ ఈ బిల్లును రూపొందించినట్టు ఆయన చెప్పారు. ఈ విధమైన బిల్లును […]

జలియన్ వాలా బాగ్ బిల్లుకు మోకాలడ్డిన కాంగ్రెస్
Follow us on

లోక్ సభలో జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ (సవరణ) బిల్లు ప్రవేశాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ నిర్వహిస్తున్న ట్రస్టుకు శాశ్వత సభ్యుడుగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుని తొలగింపునకు ఉద్దేశించిన బిల్లు ఇది. సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ బిల్లును ప్రవేశ[పెట్టారు. ట్రస్టీ గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండాలన్నపదాన్ని తొలగిస్తూ ఈ బిల్లును రూపొందించినట్టు ఆయన చెప్పారు. ఈ విధమైన బిల్లును గత ప్రభుత్వం తెఛ్చినప్పటికీ పార్లమెంటు ఆమోదానికి నోచుకోకపోవడంతో దానికి కాలదోషం పట్టింది. కాగా ఈ సవరణ బిల్లును సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యతిరేకిస్తూ.. దేశ వారసత్వ సంస్కృతిని ఇది కాలరాయడమే అవుతుందన్నారు. ఈ బిల్లును నిలిపివేయాలని, మన దేశ స్మారక చరిత్రను ప్రతిబింబించే హెరిటేజీకి ‘ ద్రోహం ‘ చేయరాదని ఆయన అన్నారు. అయితే ఈ అభ్యంతరాలను మంత్రి ప్రహ్లాద్ సింగ్ తోసిపుచ్చుతూ .. గత 40-50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఈ మెమోరియల్ కోసం చేసిందేమీ లేదన్నారు. ఈ సవరణ బిల్లు లోక్ సభలో అతి పెద్ద ఏకైక ప్రతిపక్ష నేత.. ఈ ట్రస్టు సభ్యునిగా ఉండేందుకు వీలు కల్పిస్తోందని ఆయన చెప్పారు. ( అయితే కేవలం విపక్ష నేత ట్రస్టు మెంబర్ గా ఉండడానికి మాత్రమే పాత బిల్లు వీలు కల్పించింది). కాగా-సవరణ బిల్లులో.. నామినేటెడ్ ట్రస్టీ పదవీకాలం ముగిసేముందే అతడ్ని ఏ కారణం లేకుండానే తొలగించడానికి వీలు కల్పిస్తూ మార్పులు చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇందుకు అధికారాలుంటాయి.
2013 లో వీరేంద్ర కటారియా, అంబికా సోనీ మరొకరు నామినేటెడ్ ట్రస్టీలుగా నియమితులయ్యారు. వీరి పదవీ కాలం అయిదేళ్ల పాటు ఉంటుంది. 1919 ఏప్రిల్ 13 న కల్నల్ రెజినాల్ద్ డైర్ ఆధ్వర్యాన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ జలియన్ వాలా బాగ్ లో నిరాయుధులైన వారిని ఊచకోత కోసింది.