జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఘటనపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్

| Edited By:

Dec 19, 2019 | 2:40 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో నిరసనలతో అట్టుడుకుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ, యూపీలలో కూడా పలుచోట్ల విద్యార్ధులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ యూనివర్శిటీలో చోటుచేసుకున్న హింసను తక్షణమే […]

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఘటనపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్
Follow us on

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో నిరసనలతో అట్టుడుకుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ, యూపీలలో కూడా పలుచోట్ల విద్యార్ధులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ యూనివర్శిటీలో చోటుచేసుకున్న హింసను తక్షణమే నియంత్రించాలని, శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని సూచించింది.

ఇక ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించారు. విద్యార్ధులు భద్రతపై ఆందోళన చెందుతున్నానని.. పొలిటికల్ గేమ్ అనేది మన దేశంలో ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని.. కానీ, జామియా విద్యార్థుల గురించి తనతో పాటు యావత్ దేశం కలవరపడుతోందంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. కాగా, ఈ యూనిర్సిటీలో నెలకొన్న హింసా ఘటనల నేపథ్యంలో దాదాపు 100 మంది విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వారందరినీ విడిచిపెట్టారు.