Skyroot: ఇండియన్ స్పేస్ సైన్స్‌లో కొత్త శకం.. నేడు నింగిలోకి ఫస్ట్ ప్రైవేట్ రాకెట్.. హైదరాబాద్ కంపెనీ ప్రత్యేకతలివే..

|

Nov 18, 2022 | 8:11 AM

ప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోన్న ప్రైవేట్ స్పేస్ సంస్త పేరు.. స్కైరూట్. వీళ్లు కంపెనీ పెట్టి నాలుగేళ్లు మాత్రమే పూర్తయ్యాయి. కానీ వీళ్లు సేకరించిన నిధులు కొన్ని వందల కోట్లు. అంతేనా ఈ చిన్న కాల వ్యవధిలోనే వీరొక ప్రైవేట్ రాకెట్ ను నింగిలోకి వదులుతున్నారంటే.. పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

Skyroot: ఇండియన్ స్పేస్ సైన్స్‌లో కొత్త శకం.. నేడు నింగిలోకి ఫస్ట్ ప్రైవేట్ రాకెట్.. హైదరాబాద్ కంపెనీ ప్రత్యేకతలివే..
Skyroot Rocket
Follow us on

Skyroot Aerospace Private Rocket: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోన్న ప్రైవేట్ స్పేస్ సంస్త పేరు.. స్కైరూట్. వీళ్లు కంపెనీ పెట్టి నాలుగేళ్లు మాత్రమే పూర్తయ్యాయి. కానీ వీళ్లు సేకరించిన నిధులు కొన్ని వందల కోట్లు. అంతేనా ఈ చిన్న కాల వ్యవధిలోనే వీరొక ప్రైవేట్ రాకెట్ ను నింగిలోకి వదులుతున్నారంటే.. పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ స్కైరూట్ ఇతర ప్రత్యేకతలేంటి? అనే వివరాలను చూద్దాం.. హైదరాబాద్‌కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వీకేఎస్ రాకెట్ ఈ రోజు శ్రీహరికోటలోని ఇస్రో (ISRO) నుంచి నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో ఆధ్వర్యంలో దేశంలో తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఇప్పటివరకు ఇస్రో తయారుచేసిన రాకెట్లను ప్రయోగించగా.. ఇప్పుడు మొదటిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ నింగిలోకి పంపించడానికి సిద్ధమైంది. ఏపీలోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్ షార్‌ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఈ ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ రాకెట్‌కు విక్రమ్‌-ఎస్‌ అని పేరు పెట్టారు. ఇండియన్ ప్రైవేట్ స్పేస్ హిస్టరీకి కేంద్ర బిందువైన హైదరాబాద్ కంపెనీ స్కైరూట్.. ఈ ప్రయోగం కోసం రూ. 403 కోట్లు వరకు ఖర్చు చేసింది.

ఈరోజు ఉదయం 11. 30 గంటలకు నింగిలోకి వెళ్లనున్న విక్రమ్‌- ఎస్‌ రాకెట్‌ ప్రత్యేకతలు

  • విక్రమ్‌ -ఎస్‌ రాకెట్‌ 6 మీటర్ల పొడవు, 545 కిలోల బరువు ఉంటుంది.

లక్ష్యం

  • భూమికి 103 కి. మీ. ఎత్తులోని ఆర్బిట్‌లో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్న రాకెట్

ఫైనల్ స్టేజ్

  • శ్రీహరికోటకు 115. 8 కిలోమీటర్ల దూరాన సముద్రంలో పడిపోనున్న రాకెట్

డ్యూరేషన్‌

  • ఈ ప్రయోగాన్ని 4. 50 నిమిషాలలో పూర్తి చేసేలా.. ఇస్రో సైంటిస్టుల ఏర్పాట్లు చేశారు.
  • ప్రైవేటు రాకెట్లను అంతరిక్షంలోకి పంపనున్న ఈ ప్రయోగంపై స్సేస్ సైంటిస్టుల్లో ఆసక్తి నెలకొంది.

స్కైరూట్ కంపెనీ.. ప్రత్యేకతలు

స్కైరూట్ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి.. ఇంత పెద్ద మొత్తంలో నిధుల సమీకరించిన స్కైరూట్.. లక్ష్యాలు భారీగానే ఉన్నాయి. ట్రిలియన్ డాలర్ స్పేస్ మార్కెట్ లో విపరీతమైన అవకాశాలున్నాయని. వీటిని ఒడిసి పట్టుకునేందుకే తామీ రంగంలో స్టార్టప్ ను స్థాపించామని అంటారు ఈ కంపెనీ సీఈఓ పవన్ కుమార్. అంతర్జాతీయంగా చిన్న శాటిలైట్లకు మార్కెట్ రాన్రాను పెరుగుతోంది. ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకునే తామీ సంస్థను నెలకొల్పామని అంటున్నారు స్కైరూట్ ప్రతినిథులు. వీళ్లిపుడు ఎంత ఫేమస్ అయిపోయారంటే.. భారత అంతరిక్షరంగంలోనే మొదటి ప్రవేట్ సంస్థగా పేరు సాధించారు. వీరిపుడు ప్రైవేట్ స్పేస్ లాంచ్ వెహికల్స్ కే నాయకత్వం వహిస్తున్నారు. తమ ప్రయోగాలకు భారత అంతరిక్ష కార్యక్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. విక్రమ్ సీరీస్ రాకెట్లు పూర్తి కార్బన్ ఫైబర్ కాంబినేషన్ తో ఎంతో ప్రత్యేకంగా తయారయ్యాయి. వీటి సామర్ధ్యం విషయానికి వస్తే.. లో- ఎర్త్ ఆర్బిట్ కి 800 కిలోల వరకూ ఇవి పేల్ లోడ్ లను పంపగలవు.

ఇస్రోతో జతకట్టిన స్కైరూట్..

అంతరిక్ష వ్యాపారంలో మరింత ఎదగడం కోసం స్కైరూట్- ఇస్రోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ దిశగా అడుగులు వేసిన తొలి స్టార్టప్ స్కైరూట్. స్కైరూట్ నినాదమేంటంటే.. అందరికీ ఓపెన్ స్పేస్. ఈ పేరు మీద వీరు మొదలు పెట్టిన మిసన్ లో దీర్ఘకాలిక భాగస్వాములను ఆహ్వానిస్తున్నారు. స్పేస్ లో ఇకపై భారీ లాభాలుండబోతున్నాయని.. చెబుతూ.. ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నారు. ఇకపై చిన్న శాటిలైట్ల కోసం భారీగా డిమాండు పెరుగుతుందని. తద్వారా అధిక లాభాలను ఆర్జించబోతున్నామని నమ్మకంగా చెబుతున్నారీ సంస్థ సీఓఓ నాగ భరత్.

తమ విక్రం స్పేస్ లాంచ్ వెహికల్స్ లోని మూడు ప్రొపల్షన్ టెక్నాలజీలను గుర్తించామనీ. ఈ ఏడాది మేలో మా రాకెట్ దశల్లో ఒక దాని పరీక్షను పూర్తి చేశామనీ. ఈ రోజు జరుగుతోన్న ప్రయోగం విజయవంతమైతే.. ఇక పూర్తి స్థాయి వాణిజ్య ఉపగ్రహ ప్రయోగంలోకి ధైర్యంగా అడుగు పెడతామని అంటున్నారు సంస్థ నిర్వాహకులు.

నాలుగేళ్లలోనే ఈ స్థాయికి గర్వకారణంగా చెబుతారు.. ఈ సంస్థ నిర్వాహకులు. స్కైరూట్ డెవలప్ చేసిన క్రయోజనిక్, హైపవర్ గోలిక్ లిక్విడ్ తో పాటు ఘన ఇంధన రాకెట్ ఇంజిన్లను విజయవంతంగా నిర్మించి.. పరీక్షించింది. ఇటీవలి సర్వే ప్రకారం.. 2022 నాటికి 14 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ స్పేస్ లాంచ్ సర్వీసెస్ మార్కెట్.. 2029 నాటికి 30 బిలియన్ డాలర్లకు పైగా విస్తరించవచ్చని అంచనా. దీన్నిబట్టీ చూస్తే.. స్కైరూట్ లాంటి సంస్థలకు అంతరిక్షం నుంచి కాసుల వర్షం కురవడం ఖాయంగా తెలుస్తోంది.

లైవ్ స్ట్రీమింగ్..

మరిన్ని జాతీయ వార్తల కోసం..