e-Catering: శుభవార్త.. ఫిబ్రవరి 1 నుంచి రైళ్లలో ఈ-కేటరింగ్‌ సేవలు.. పునః ప్రారంభించనున్న ఐఆర్‌సీటీసీ

|

Jan 31, 2021 | 5:24 AM

e-Catering : ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్‌ సేవలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భారతీయ రైల్వే శాఖ...

e-Catering: శుభవార్త.. ఫిబ్రవరి 1 నుంచి రైళ్లలో ఈ-కేటరింగ్‌ సేవలు.. పునః ప్రారంభించనున్న ఐఆర్‌సీటీసీ
Follow us on

e-Catering : ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్‌ సేవలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భారతీయ రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. 2020 మార్చి 22 నుంచి ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్‌ సేవలు ప్రారంభం కాలేదు. లాక్‌డౌన్‌ తర్వాత దశల వారీగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా.. ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్‌ సేవలు మాత్రం ప్రారంభం కాలేదు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆంక్షలు నడలిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదలవుతుండటంతో ఈ-కేటరింగ్‌ మళ్లీ ప్రారంభించేందుకు సిద్దమైంది రైల్వే శాఖ. కాగా, ఈ సేవలు ప్రారంభమైతే రైల్వే ప్రయాణికులు ప్రయోజనం కలుగనుంది. ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తమ బెర్తుకే తప్పించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ ఇ-కేటరింగ్‌ వెబ్‌సైట్‌ https://www.ecatering.irctc.co.in/ లేదా 1323 నెంబర్‌ ద్వారా కూడా ఆర్డర్‌ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్‌ యాప్‌ అయిన ‘Food on Track’ యాప్‌ కూడా ఉపయోగించుకోవచ్చు.

కాగా, ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్‌ సేవలు దేశ వ్యాప్తంగా మొత్తం ఒకేసారి ప్రారంభించకుండా దశలవారీగా ప్రారంభించే అవకాశాలున్నాయి. ముందుగా 30 రైల్వే స్టేషన్‌లలో ఈ సేవలు ప్రారంభించి 250 రైళ్లకు మాత్రమే కేటరింగ్‌ సేవలను అందించనుంది రైల్వేశాఖ. తర్వాత దశలవారీగా దేశ వ్యాప్తంగా ప్రారంభించనుంది.

Budget 2021: మరో రెండు రోజులు.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక బడ్జెట్.. లైవ్ టెలికాస్ట్‌ను వీక్షించండి ఇలా..