Indian Railway: రైళ్లల్లో ఉచిత వాటర్ బాటిల్ బంద్..! రైల్వేశాఖ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది

రైళ్లల్లో ఉచిత వాటర్ బాటిల్‌పై ప్రయాణికుల్లో కన్‌ప్యూజన్ నెలకొంది. వందే భారత్, శతాబ్ది, రాజధాని వంటి ప్రీమియం రైళ్లల్లో రైల్వేశాఖ ఉచిత వాటర్ బాటిల్ అందిస్తోంది. కానీ నో ఫుడ్ ఆప్షన్‌ను ఎంచుకున్నవారికి ఇది ఇవ్వరనే ప్రచారం నడుస్తోంది. దీంతో రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది.

Indian Railway: రైళ్లల్లో ఉచిత వాటర్ బాటిల్ బంద్..! రైల్వేశాఖ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది
Vande Bharat

Updated on: Dec 10, 2025 | 2:49 PM

కరోనా తర్వాత రైళ్లల్లో భారతీయ రైల్వే అనేక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫుడ్ సర్వీసుల విషయంలో కీలక మార్పులు చేసింది. గతంలో ప్రీమియం ట్రైన్లలో ఫుడ్‌ను ట్రైన్ టికెట్‌తో పాటే అందించేవారు. కానీ కరోనా తర్వాత ప్రయాణికులు టికెట్‌తో పాటు ఫుడ్‌ను ప్రత్యేకంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ కావాలా..? వద్దా? అనేది ఎంచుకునే ఆప్షన్‌ను ప్రయాణికులకే ఐఆర్‌సీటీసీ వదిలేసింది. ఈ ఆప్షన్ రాజథాని, శతాబ్ది, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లల్లో అమలు చేస్తున్నారు. మీరు ఫుడ్ ఆఫ్షన్‌ను ఎంచుకుంటే టికెట్‌తో పాటు డబ్బులు వసూలు చేస్తారు. అదే వద్దనుకుంటే ఛార్జీ నుంచి ఫుడ్ ఆప్షన్‌ను తొలగిస్తారు.

ఉచిత వాటర్ బాటిల్ ఉండదా..?

అయితే ఫుడ్ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం ప్రయాణికులకే వదిలేయడంతో ప్రీమియం రైళ్లల్లో ఫ్రీ లీటర్ వాటర్ బాటిల్ అందిస్తారా.. లేదా అనే దానిపై ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది. నో ఫుడ్ ఆఫ్షన్ ఎంచుకుంటే వాటర్ బాటిల్ ఇవ్వరనే ప్రచారం జరగుతోంది. ఈ క్రమంలో దీనిపై ఐఆర్‌సీటీసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. మీల్ ఆప్షన్ ఎంచుకున్నా.. ఎంచుకోకపోయినా ఉచితంగా వాటర్ బాటిల్ అందిస్తామని తెలిపారు.

నో ఫుడ్ ఆప్షన్ తొలగించిందా..?

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ప్రీమియం రైళ్లల్లో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఫుడ్ ఆఫ్షన్‌ను ఎంచుకోవాల్సిందిగా బలవంతపెడుతున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై స్పందించిన అధికారులు.. ఆ వార్తలన్నీ అవాస్తమవని, నో ఫుడ్ ఆప్షన్‌ను తాము తొలగించలేదని అన్నారు. బుకింగ్ పేజీలో దాని స్థానాన్ని సవరించడం వల్ల ప్రయాణికులు కన్‌ప్యూజన్ అవుతున్నారని తెలిపారు.

నో ఫుడ్ ఆఫ్షన్ ఎక్కడ..?

-ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్న ట్రైన్‌ను ఎంచుకోండి

-ప్రయాణికుల వివరాలు పేజీకి వెళ్లండి

-క్యాటరింగ్ సర్వీస్‌లోకి వెళ్లి నో ఫుడ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి

-ఆ తర్వాత మీ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి