Punjab: ఖలీస్తానీ సానుభూతిరుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్.. పంజాబ్‌లో ఇంటర్నెట్ సేవలు బంద్..

పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అన్ని రకాల మొబైల్ ఇంటర్నెట్ సేవలను, ఎస్‌ఎంఎస్ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 19వ తేదీ మధ్యాహ్నం

Punjab: ఖలీస్తానీ సానుభూతిరుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్.. పంజాబ్‌లో ఇంటర్నెట్ సేవలు బంద్..
Internet Shut Down
Follow us

|

Updated on: Mar 18, 2023 | 3:52 PM

పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అన్ని రకాల మొబైల్ ఇంటర్నెట్ సేవలను, ఎస్‌ఎంఎస్ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోం వ్యవహారాలు, న్యాయశాఖ ప్రకటించింది. కాగా, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ సవాల్ చేసిన నేపథ్యంలో పంజాబ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే అమృత్‌ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు.. అతని సహాయకుల కోసం వేట సాగిస్తున్నారు. అయితే, అమృత్‌ పాల్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో అలర్ట్ అయిన పంజాబ్ పోలీసులు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరోవైపు తనను పోలీసుల నుంచి రక్షించాలంటూ ప్రజలను వేడుకుంటున్నాడు అమృత్‌ పాల్ సింగ్. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు ముందస్తుగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles