అయోధ్య కాదు.. రాహుల్‌తో అక్కడికి వెళ్లు.. ఉద్దవ్‌పై జీవీఎల్ ఫైర్..

| Edited By:

Jan 26, 2020 | 12:53 PM

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మార్చి 7వ తేదీన ఉద్దవ్ థాక్రే అయోధ్య పర్యటించబోతున్నట్లు ప్రకటించడంపై జీవీఎల్ స్పందించారు. ఉద్దవ్ అయోధ్య వెళ్లడం కాదని.. రాహుల్ గాంధీతో కలిసి ‘హజ్ యాత్రకు’ టిక్కెట్లు బుక్ చేసుకోవడం మంచిదన్నారు. ఉద్ధవ్ చేస్తున్న తాజా రాజకీయాలకు.. అయోధ్య టూర్ కంటే.. హజ్ యాత్ర అయితేనే బాగుంటుందంటూ వ్యాఖ్యానించారు. ఉద్దవ్.. కాంగ్రెస్,ఎన్సీపీలతో జతకట్టారని.. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే కాంగ్రెస్, రాహుల్ దయాదాక్షిణ్యాలతోనే […]

అయోధ్య కాదు.. రాహుల్‌తో అక్కడికి వెళ్లు.. ఉద్దవ్‌పై జీవీఎల్ ఫైర్..
Follow us on

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మార్చి 7వ తేదీన ఉద్దవ్ థాక్రే అయోధ్య పర్యటించబోతున్నట్లు ప్రకటించడంపై జీవీఎల్ స్పందించారు. ఉద్దవ్ అయోధ్య వెళ్లడం కాదని.. రాహుల్ గాంధీతో కలిసి ‘హజ్ యాత్రకు’ టిక్కెట్లు బుక్ చేసుకోవడం మంచిదన్నారు. ఉద్ధవ్ చేస్తున్న తాజా రాజకీయాలకు.. అయోధ్య టూర్ కంటే.. హజ్ యాత్ర అయితేనే బాగుంటుందంటూ వ్యాఖ్యానించారు. ఉద్దవ్.. కాంగ్రెస్,ఎన్సీపీలతో జతకట్టారని.. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే కాంగ్రెస్, రాహుల్ దయాదాక్షిణ్యాలతోనే ఆయన సీఎంగా ఉన్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్యకు ఉద్దవ్ వెళ్లకుండా.. రాహుల్ గాంధీకి ఇష్టమున్న చోటుకు వెళ్లడం మంచిదని సూచించారు. ఉద్ధవ్ థాక్రే ఆయన బాల్ థాక్రే తరహా.. హిందుత్వ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు జీవీఎల్.

కాగా, ఉద్దవ్ టూర్‌ విషయంపై ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ గత శనివారమే ధ్రువీకరించారు. శివసేన మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల నేతలు కూడా సీఎం వెంట అయోధ్యకు వెళ్తారని తెలిపారు.