ఈవీ యూజర్స్ బీకేర్‌ఫుల్.. ఈ తప్పు అస్సలు చేయకండి.. ఏడుగురి ప్రాణాలు తీసిన ఎలక్ట్రిక్ కారు!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోరం ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ కారు ఏకంగా ఏడుగురి ప్రాణాలు తీసింది. బైక్ ప్రాణాలు తీయడం ఏంటనుకుంటున్నారా? ఓ వ్యక్తి తన ఎలక్ట్రిక్ కారును ఇంటి బయట ఛార్జింగ్ పెట్టి ఉంచాడు. అయితే అది ఛార్జ్‌ ఫుల్‌ అయి ఓవర్ హీట్ కావడంతో బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న గ్యాస్ సలిండర్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈవీ యూజర్స్ బీకేర్‌ఫుల్.. ఈ తప్పు అస్సలు చేయకండి.. ఏడుగురి ప్రాణాలు తీసిన ఎలక్ట్రిక్ కారు!
Seven Killed In Fire At House In Indore

Updated on: Mar 18, 2026 | 12:09 PM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్‌ ముందున్న ఛార్జింగ్ పాయింట్ వద్ద ఉన్న ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కొద్ది క్షణాల్లోనే ఈ మంటలు అ భవనం మొత్తం వ్యాపించడంతో మూడు అంతస్తుల భవంలో ఉన్న సుమారు 10 సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానిరి చేరుకన్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌లోని బ్రజేశ్వరి అనెక్స్ కాలనీలోని ఇంట్లో బుధవారం తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కుందన్ మండ్లోయ్ పీటీఐకి తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించారని తెలిపారు. అయితే ఈ ప్రమాదం తర్వాత అదే కుటుంబానికి చెందిన ఓ చిన్నారి కూడా కనిపించకుండా పోయిందని.. ఆ బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.

అయితే మంటలు చెలరేగడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లోంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని.. కానీ ఇంటికి ఎలక్ట్రానిక్ డోర్స్ ఉండడంతో అవి ఆటోమెటిక్‌గా లాక్ అయిపోయాయని పోలీసులు తెలిపారు. అందుకే బయటకు వచ్చే సమయం ఉన్నా.. ఇంట్లోని కుటుంబ సభ్యులు తప్పించుకోలేక పోయారని తెలిపారు. సమాచారం అందింన వెంటనే తాము ఘటనా స్థలానికి చేరుకున్నామని.. ప్రమాద సమయంలో ఇంట్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించాంమని.. వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us