భారత-చైనా మధ్య మళ్ళీ సైనిక స్థాయి చర్చలు, ఫలించేనా ?

| Edited By: Anil kumar poka

Sep 21, 2020 | 12:54 PM

ఉద్రిక్తతల నివారణకు భారత-చైనా దేశాల మధ్య సోమవారం మళ్ళీ సైనికకమాండర్ల స్థాయిలో చర్చలు మొదలయ్యాయి. ఈస్టర్న్ లడాఖ్ లోని మోల్డో సమీపంలో గల చైనీస్ బోర్డర్ పోస్ట్ వద్ద జరుగుతున్న ఈ చర్చల్లో విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ కూడా పాల్గొంటున్నారు.

భారత-చైనా మధ్య మళ్ళీ సైనిక స్థాయి చర్చలు, ఫలించేనా ?
Follow us on

ఉద్రిక్తతల నివారణకు భారత-చైనా దేశాల మధ్య సోమవారం మళ్ళీ సైనికకమాండర్ల స్థాయిలో చర్చలు మొదలయ్యాయి. ఈస్టర్న్ లడాఖ్ లోని మోల్డో సమీపంలో గల చైనీస్ బోర్డర్ పోస్ట్ వద్ద జరుగుతున్న ఈ చర్చల్లో విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ కూడా పాల్గొంటున్నారు. ఇలా ఓ అత్యున్నత స్థాయి అధికారి కూడా వీటిలో పాలుపంచుకోవడం ఇదే మొదటిసారి. లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో గతంలో  కూడా చాలాసార్లు చర్చలు జరిగాయి. ఇప్పుడిది ఆరోసారి. వాస్తవాధీన రేఖ వద్ద చైనా సేనలు వెనక్కి వెళ్లాలని ఇండియా కోరడం, సరేనన్నట్టు చైనా సైనికాధికారి అంగీకరించడం, ఇదే సమయంలో మీ దళాలు కూడా వెనక్కి మళ్ళాలని ఆయన కూడా  కోరడం పరిపాటి అవుతూ వస్తోంది. చైనావారు వెనక్కి వెళ్ళినట్టే వెళ్లి తిరిగి యధాప్రకారం సరిహద్దుల్లో మోహరించడం జరుగుతోంది. ఫిక్షన్ పాయింట్ల వద్ద పూర్తి డిస్ ఎంగేజ్ మెంట్ జరగాలని ఎప్పటిలాగే భారత సైన్యం ఇప్పుడు కూడా కోరుతోంది. మరి-ఈ సారైనా ఈ చర్చలు ఫలిస్తాయో లేదో చూడాలి..