Chennai Airport : ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..ల్యాండింగ్ సమయంలో..

దీనికి ముందు, ఇదే విమానం VT-IBI కూడా గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రమాదానికి గురైంది. అప్పటి నుండి దాదాపు ఒక నెల క్రితం వరకు, ఈ విమానం ఎగరకుండా నిషేధించబడింది. గత 18 నెలల్లో ఇండిగో విమానాలు ఎనిమిది సార్లు ఇలాంటి ఘటనలను ఎదుర్కొన్నాయి. విమానం వెనుక భాగంలో చాలా గీతలు పడి ఉన్నట్టుగా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Chennai Airport : ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..ల్యాండింగ్ సమయంలో..
Indigo Flight

Updated on: Mar 10, 2025 | 9:33 AM

చెన్నై విమానాశ్రయంలో ఒక విమానం తృటిలో ప్రమాదం నుండి తప్పించుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం వెనుక భాగం రన్‌వేను ఢీకొట్టింది. దాని కారణంగా అది దెబ్బతింది. శనివారం చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌బస్ A321 (VT-IBI) ల్యాండ్ అవుతుండగా వెనుక భాగం దెబ్బతినడంతో ఈ సంఘటన జరిగింది. దీని తరువాత విమానాన్ని మరమ్మతుల కోసం విమానాశ్రయంలో నిలిపివేశారు. ఈ విమానం ముంబై నుండి చెన్నైకి వెళుతోంది.

ఈ సంఘటనను వెంటనే అధికారులకు నివేదించారు. ఈ విషయాన్ని ఇప్పుడు విమాన ప్రమాద దర్యాప్తు బోర్డు (AAIB) దర్యాప్తు చేస్తోంది. ఇండిగో విడుదల చేసిన ఒక ప్రకటనలో మార్చి 8న చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్నప్పుడు ఇండిగో ఎయిర్‌బస్ A321 విమానం వెనుక భాగం రన్‌వేను తాకిందని వెల్లడించింది. దీనిపై ఇండిగో స్పందిస్తూ.. తమ కస్టమర్లు, సిబ్బంది, విమానాల భద్రత మా అత్యంత ప్రాధాన్యత అని ఇండిగో తెలిపింది. మేము అన్ని భద్రతా ప్రమాణాలతో పని చేస్తాము. విమానాల కారణంగా మా కస్టమర్లకు కలిగిన ఏదైనా అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము.

దీనికి ముందు, ఇదే విమానం VT-IBI కూడా గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రమాదానికి గురైంది. అప్పటి నుండి దాదాపు ఒక నెల క్రితం వరకు, ఈ విమానం ఎగరకుండా నిషేధించబడింది. గత 18 నెలల్లో ఇండిగో విమానాలు ఎనిమిది సార్లు ఇలాంటి ఘటనలను ఎదుర్కొన్నాయి. విమానం వెనుక భాగంలో చాలా గీతలు పడి ఉన్నట్టుగా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు వెనుక భాగం రన్‌వేను ఢీకొన్నప్పుడు ఈ గీతలు పడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..