ఓర్నాయనో.. జనం ఎక్కువగా ఖర్చు చేసేది వాటి కోసమా.. తాజా రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు..

ఉరుకులు పరుగుల జీవితం.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. ఇటు పట్టణాలు, పల్లెల్లో కూడా కూల్ డ్రింక్స్, ప్యాకేజ్ ఫుడ్, ఇతర జంక్ ఫుడ్ కోసం ప్రతి నెల ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో వ్యక్తి నెలలో చేసిన ఖర్చులపై ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ను విడుదల చేసింది.

ఓర్నాయనో.. జనం ఎక్కువగా ఖర్చు చేసేది వాటి కోసమా.. తాజా రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు..
Junk Food Drinks

Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 16, 2025 | 12:56 PM

ఉరుకులు పరుగుల జీవితం.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. ఇటు పట్టణాలు, పల్లెల్లో కూడా కూల్ డ్రింక్స్, ప్యాకేజ్ ఫుడ్, ఇతర జంక్ ఫుడ్ కోసం ప్రతి నెల ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో వ్యక్తి నెలలో చేసిన ఖర్చులపై తాజాగా కేంద్రం ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ను విడుదల చేసింది. ఆ రిపోర్టులో పల్లెల్లో, పట్టణాల్లో సగటు మనిషి నెల ఖర్చు ఎలా ఉంది అనే దానిపై ఈ అధ్యయనం జరిగింది.. ఆ రిపోర్ట్ ఎలా ఉంది.. ఏమని చెప్పింది.. ఈ వివరాలను తెలుసుకోండి.. పల్లె ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి నెలకు సగటున 5435 రూపాయలు ఖర్చు చేయగా… అదే పట్టణంలో దాదాపు 8978 ఖర్చు చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. అయితే 2022 -23 లో పల్లెల్లో సగటు ఖర్చు 4802 రూపాయలకు పైగా ఉండగా.. అది పట్టణంలో 8158గా ఉంది.

మామూలుగా సిటీ లాంటి ప్రాంతాల్లో కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ లాంటి పదార్థాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇదే ట్రెండు గ్రామాలకు కూడా విస్తరించింది. గ్రామాలు – పట్టణాలు – నగరాలు అని తేడా లేకుండా ఎక్కువగా జంక్ ఫుడ్ పైనే ఖర్చు చేస్తున్నారని అధ్యయనం తెలిపింది. సిటీలో ఒక్కో వ్యక్తి సగటున జంక్ ఫుడ్ కోసం వెయ్యి రూపాయలకు పైగానే ఖర్చు చేస్తున్నారు. అది మొత్తం ఖర్చులో 12 శాతంగా ఉంది. మరి పల్లెల్లో ఒక్కో వ్యక్తి ఈ జంక్ ఫుడ్ కోసం దాదాపు రూ.500 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు.. ఇది మొత్తం ఖర్చులో 9% గా ఉంది.

పట్టణంలో జంక్ ఫుడ్ తర్వాత ఎక్కువ ఖర్చు ఇంటి రెంట్ కోసం ఖర్చు చేస్తుండగా.. గ్రామాల్లో మొత్తం ప్రయాణాల కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రయాణాల తర్వాత గ్రామీణ ప్రజలు మందు, సిగరెట్, అంటే హానికరక పదార్థాలపైనే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. సగటున ఒక్కో వ్యక్తి వాటిపై దాదాపు 400 రూపాయల వరకు ఖర్చు చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో పొగాకు మందుపై దాదాపు 300 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని అధ్యయనం పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..