Telecom Scam: భారత్‌లో సగటున ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని ఫేక్‌ మెసేజ్‌లు, కాల్స్‌ వస్తున్నాయో తెలుసా.?

|

Sep 07, 2024 | 3:08 PM

టెలికమ్యూనికేషన్ శాఖ నివేదిక ప్రకారం.. కాల్స్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌, వాట్సాప్ ద్వారా ఇప్పటి వరకు 93,081 అభ్యర్థనలు అందాయి. వీటిలో కాల్స్ ద్వారా 60,730, వాట్సాప్ ద్వారా 29,325, ఎస్ఎంఎస్ ద్వారా 3,026 అభ్యర్థనలు అందాయి. అత్యధికంగా ఉత్త్‌ప్రదేశ్‌ నుంచి 10,392 కేసులు నమోదయ్యాయి. అధికారులు వీటిలో 80,209 కాల్‌లు, 5,988 వాట్సాప్, 997 ఎస్‌ఎంఎస్‌ల ద్వారా 89,970 నమోదైన కేసులను...

Telecom Scam: భారత్‌లో సగటున ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని ఫేక్‌ మెసేజ్‌లు, కాల్స్‌ వస్తున్నాయో తెలుసా.?
Fraud Messages
Follow us on

భారత్‌లో సైబర్‌ మోసలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా టెలికమ్యూనికేషన్‌ స్కామ్‌లకు లెక్కే లేకుండా పోతోంది. దేశంలో సగటున ఒక వ్యక్తికి రోజులో 12 మోసపూరిత మెసేజ్‌లు వస్తున్నట్లు గణంకాలు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏకంగా 93,081 టెలికమ్యూనికేషన్ స్కామ్‌లు నమోదయ్యాయని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నివేదించింది. భారత్‌లో రోజురోజుకీ పెరిగిపోతున్న టెలి కమ్యూనికేషన్‌ కేసులు భయపెడుతున్నాయి.

టెలికమ్యూనికేషన్ శాఖ నివేదిక ప్రకారం.. కాల్స్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌, వాట్సాప్ ద్వారా ఇప్పటి వరకు 93,081 అభ్యర్థనలు అందాయి. వీటిలో కాల్స్ ద్వారా 60,730, వాట్సాప్ ద్వారా 29,325, ఎస్ఎంఎస్ ద్వారా 3,026 అభ్యర్థనలు అందాయి. అత్యధికంగా ఉత్త్‌ప్రదేశ్‌ నుంచి 10,392 కేసులు నమోదయ్యాయి. అధికారులు వీటిలో 80,209 కాల్‌లు, 5,988 వాట్సాప్, 997 ఎస్‌ఎంఎస్‌ల ద్వారా 89,970 నమోదైన కేసులను పరిష్కరించినట్లు నివేదికలో పేర్కొన్నారు. కాగా మొత్తం 2,776 మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, 997 హెడర్‌లు, 5,988 వాట్సాప్ ఖాతాలను అధికారులు బ్లాక్‌ చేశారు.

దేశంలోనే అత్యధికంగా కేసులను పరిష్కరించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ 13,380 కేసులతో నిలిచింది. ప్రఖ్యాత సైబర్‌ సెక్యూరిటీ సంస్థ McAfee తన మొదటి ‘గ్లోబల్ స్కామ్ మెసేజ్ స్టడీ’ని 2023లో నిర్వహించింది. భారతీయులు మోసపూరిత సందేశాలను గుర్తించేందుకు వారానికి 1.8 గంటలు వెచ్చిస్తున్నారని, ప్రతిరోజూ సగటున 12 స్కామ్‌లు లేదా నకిలీ సందేశాలను స్వీకరిస్తున్నారని అధ్యయనంలో తేలింది. నకిలీ సందేశాల ద్వారా మోసపోతున్న కేసుల్లో అధికంగా 64 శాతం నకిలీ ఉద్యోగ నోటిఫికేన్ల పేర్లతో కాగా 52 శాతం బ్యాంక్‌ల పేరుతో వచ్చిన సందేశాలు ఉన్నాయి. McAfee నివేదిక ప్రకారం వాయిస్‌, క్లోన్ మధ్య తేడాలను 83 శాతం మంది గుర్తించలేరని తేలిది.

మోసం బారిన పడితే ఏం చేయాలి..

మీరు సైబర్‌ నేరం బారిన పడినట్లు అనుమానం వచ్చిన వెంటనే మొదట సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930లో రిపోర్ట్ చేయాలి. లేదా https://www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. అదే విధంగా https://sancharsaathi.gov.in/sfc/Home/sfc-complaint.jsp లో ‘CHAKSHU’ పోర్టల్ కూడా మీ ఫిర్యాదులను వెల్లడించవచ్చు. వీటన్నింటితోపాటు మీకు సమీంలో ఉన్న పోలీసులకు సైతం ఫిర్యాదు చేయొచ్చు.

ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది..

సైబర్‌ నేరాల మోసాల బారిన పడకుండా ఉండాలంటే. అనవసరమైన లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదు. సోషల్‌ మీడియాలో వచ్చే హైపర్‌ లింక్‌ల జోలికి వెల్లకూడదు. అలాగే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందే రివ్యూలను పరిశీలిచాలి. ఇక ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు రిక్వెస్ట్‌లను ఎట్టి పరిస్థితుల్లో పంపకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీ ఓటీపీని ఎవరితో పంచుకోకూడదు.