దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రాణవాయువుకు అధిక డిమాండ్.. పరుగులు తీయనున్న ‘ఆక్సిజన్ ఎక్స్‏ప్రెస్’ రైళ్లు

|

Apr 19, 2021 | 6:58 AM

Oxygen express trains: దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజూకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి.

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రాణవాయువుకు అధిక డిమాండ్.. పరుగులు తీయనున్న ఆక్సిజన్ ఎక్స్‏ప్రెస్ రైళ్లు
Oxygen Express Trains
Follow us on

Oxygen express trains: దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజూకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా పలు ఆసుపత్రులలో బెడ్స్ కొరతనే కాకుండా.. ఆక్సిజన్ కోరత ఏర్పడుతుంది. దీంతో ఆక్సిజన్ అందకుండా.. చాలా మంది కరోనా రోగులు మృతిచెందుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు సరఫరా చేయాని కేంద్రం నిర్ణయించింది.

లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, అలాగే సిలిండర్లను దేశవ్యాప్తంగా రవాణా చేయాడానికి కొద్ది రోజుల్లో ‘ఆక్సిజన్ ఎక్స్‏ప్రెస్’ రైళ్ళను నడపనున్నట్లుగా జాతీయ రవాణాదారు శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ కు డిమాండ్ అధికంగా పెరిగిపోయింది. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ వైజాగ్, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారోలను లోడ్ చేయడానికి ఖాలీ ట్యాంకర్లను ముంబై సమీపంలోని కలంబోలి , బోయిసర్ రైల్వే స్టెషన్ల నుంచి రైళ్ళు సోమవారం ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. రైల్వే నెట్‌వర్క్ ద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించవచ్చా అనే విషయంలో గతంలోనే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే మంత్రిత్వ శాఖను ఆశ్రయించాయని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యర్థనల తర్వాత రైల్వే శాఖ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రవాణా యొక్క సాంకేతిక పరిస్థితులను పరిక్షీంచిందని… ఫ్లాట్ వ్యాగన్లపై ఉంచిన రోడ్ ట్యాంకర్లతో రోల్-ఆన్-రోల్-ఆఫ్ సేవ ద్వారా రవాణా చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు.

ఏప్రిల్ 19న మొదట ఖాళీ ట్యాంకర్లను నడపుతామని..ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను ప్రారంభిస్తామని తెలిపారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నచోట ఈ రైళ్ళను ముందుగా చేరవేస్తామన తెలిపారు. ఈ రైళ్లు వేగంగా గమ్యస్థానాలు చేరుకునేందుకు వీలుగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణించే మార్గంలో ఎలాంటి ఆటంకాలు, నిలుపుదలలు లేకుండా చర్యలు తీసుకోనున్నారు.

ట్వీట్..

Also Read: నా ఆరోగ్యం కుదుటపడుతోంది… త్వరలోనే మీ ముందుకు వస్తా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ…

Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..