Indian Railways: రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఇలా చేశారంటే చిక్కుల్లో పడటం ఖాయం.. భారీ మొత్తంలో జరిమానా విధిస్తారు!

రైళ్లలో ప్రయాణించే వారి కోసం భారతీయ రైల్వే శాఖ కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టింది. రైళ్లలో ఈ నిబంధనలు పాటించకపోతే ప్రయాణికులు చిక్కుల్లో పడతారు. అవేంటంటే.. ఏదైనా కోచ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్‌ కాల్‌లో గట్టిగా మాట్లాడటం..

Indian Railways: రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఇలా చేశారంటే చిక్కుల్లో పడటం ఖాయం.. భారీ మొత్తంలో జరిమానా విధిస్తారు!
Indian Railways

Updated on: Jan 09, 2023 | 11:21 AM

రైళ్లలో ప్రయాణించే వారి కోసం భారతీయ రైల్వే శాఖ కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టింది. రైళ్లలో ఈ నిబంధనలు పాటించకపోతే ప్రయాణికులు చిక్కుల్లో పడతారు. అవేంటంటే.. ఏదైనా కోచ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్‌ కాల్‌లో గట్టిగా మాట్లాడటం ఇకపై నిషేదం. అలాగే పెద్ద సౌండ్‌ పెట్టుకుని పాటలు వినడం, బిగ్గరగా అరవడం లాంటివి ఇకపై చేయకూడదు. సాధారణంగా రైలు ప్రయాణాల్లో ఇటువంటి సంఘటనలు చూసే ఉంటారు. ఇలా చేయడం వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. ఇప్పటికే ఈ తరహా వాటిపై రైల్వే శాఖకు ఎన్నో ఫిర్యాదులు సైతం చేరాయి. ఈ సమస్యకు రైల్వే శాఖ చెక్‌ పెట్టనుంది.

ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారికి నిద్రకు భంగం కలగకుండా, ప్రయాణంలో ప్రశాంతంగా నిద్రించేందుకు కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికులు బిగ్గరగా మాట్లాడడం, పెద్దగా సంగీతం వినడం, అరవడం లాంటివి చేయకూడదు. ఇతర ఏ విధంగానైనా ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించినా రైలు సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు. రైలు సిబ్బంది ఆయా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటారు. నిబంధనలు పాటించని వారికి భారీ మొత్తంలో ఫైన్‌ వేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.