Vande Metro: వందే మెట్రో పేరు మారింది.. ఇక నుంచి ఏమని పిలవనున్నారంటే

|

Sep 16, 2024 | 12:34 PM

ఇక నమో భారత్ ర్యాపిడ్‌ రైల్‌ వివరాల్లోకి వెళితే.. ఇది అన్‌రిజర్వ్‌డ్‌ ఎయిర్‌ కండీషన్‌తో కూడిన రైలు. ఇందులో 1150 మంది కూర్చుని, 2058 మంది నిల్చుని ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అహ్మదాబాద్- భుజ్‌ల మధ్య 9 స్టాపుల్లో ఈ రైలు ఆగుతుంది. 360 కిలోమీటర్ల జర్నీ కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకోవడం ఈ రైలు ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక ఈ రైలు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది....

Vande Metro: వందే మెట్రో పేరు మారింది.. ఇక నుంచి ఏమని పిలవనున్నారంటే
Vande Metro
Follow us on

భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ.. ఇండియన్‌ రైల్వే సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వందే భారత్‌ పేరుతో అధునాతన రైళ్లను తీసుకొచ్చాయి. దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వేగంతో కూడిన ప్రయాణం, అధునాతన సౌకర్యాలతో వచ్చిన వందే భారత్‌ రైళ్లకు దేశ వ్యాప్తంగా భారీగా ఆదరణ లభిస్తోంది.

ఇదిలా ఉంటే రైల్వే ఆధునీరణలో భాగంగా ఇండియన్‌ రైల్వే వందే మెట్రో సేవలను సైతం తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు (సెప్టెంబర్‌ 16) ప్రధాని మోదీ మెట్రో సేవలను గుజరాత్‌లో ప్రారంభిస్తున్నారు. దేశంలో తొలి వందే మెట్రో భుజ్‌ నుంచి అహ్మదబాద్‌ పయణించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రైలు పేరును మార్చుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఈ రైలను నమో భారత్‌ ర్యాపిడ్ రైల్‌గా పిలవనున్నారు.

ఇక నమో భారత్ ర్యాపిడ్‌ రైల్‌ వివరాల్లోకి వెళితే.. ఇది అన్‌రిజర్వ్‌డ్‌ ఎయిర్‌ కండీషన్‌తో కూడిన రైలు. ఇందులో 1150 మంది కూర్చుని, 2058 మంది నిల్చుని ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అహ్మదాబాద్- భుజ్‌ల మధ్య 9 స్టాపుల్లో ఈ రైలు ఆగుతుంది. 360 కిలోమీటర్ల జర్నీ కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకోవడం ఈ రైలు ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక ఈ రైలు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ప్రతి రోజూ ఉదయం భుజ్‌లో 5.05 గంటలకు ప్రారంభమై అహ్మదాబాద్‌ జంక్షన్‌కు 10.50 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలులో ముందస్తు రిజర్వేషన్లు ఉండదు. ప్రయాణికులు ప్రయాణానికి కొన్ని నిమిషాల ముందే టికెట్‌ కొనుక్కుని రైలులో ప్రయాణించవచ్చు. ఈ రైలులో పూర్తి ఏసీ కోచ్‌లు, కవచ్‌ వంటి భద్రతా ఫీచర్లను అందించారు. ఇక రైలు కనీస టికెట్ రూ. 30గా నిర్ణయించారు. త్వరలోనే ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. తిరుపతి, చెన్నైలతో పాటు హైదరాబాద్‌ వరంగల్‌ మధ్య ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..