Indian Railways: శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అద్భుతమైన సదుపాయం.. ఒక్కసారి ప్రయాణించారంటే మర్చిపోలేరు అనుభూతి

|

Aug 14, 2022 | 12:30 PM

Indian Railways: ప్రయాణికుల అనుభూతి కోసం నిరంతరం కృషి చేస్తున్న భారతీయ రైల్వే, ఈసారి ప్రయాణికుల కోసం మరో అద్భుతమైన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది..

Indian Railways: శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అద్భుతమైన సదుపాయం.. ఒక్కసారి ప్రయాణించారంటే మర్చిపోలేరు అనుభూతి
Vistadome Coach
Follow us on

Indian Railways: ప్రయాణికుల అనుభూతి కోసం నిరంతరం కృషి చేస్తున్న భారతీయ రైల్వే, ఈసారి ప్రయాణికుల కోసం మరో అద్భుతమైన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సెంట్రల్ రైల్వే జోన్ ఐదవ విస్టాడియం కోచ్‌ను ప్రవేశపెట్టింది. పూణే-సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం. 12026/12025)లో రైల్వే తరపున ఈ కోచ్ అమర్చబడింది.

ప్రకృతిని ఆస్వాదించేందుకు..

రైలు ప్రయాణికులు ప్రకృతిని అస్వాదించేందుకు ఈ అద్భుతమైన సదుపాయన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. విస్టాడియం కోచ్‌లో ప్రయాణించే ప్రయాణికులు ప్రయాణంలో ప్రకృతిని ఆస్వాదించవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లలో ఇలాంటి కోచ్‌ల సౌకర్యాన్ని ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ తరహా కోచ్‌లో ప్రయాణించే మజా వేరు. ఇందులో పైన అమర్చిన అద్దం, వెడల్పు విండో ప్యానెల్ కారణంగా ప్రయాణికుల రైలు ప్రయాణం అద్భుతంగా సాగనుంది.

ఇవి కూడా చదవండి

సికింద్రాబాద్-పూణే శతాబ్ది టైమింగ్స్:

సికింద్రాబాద్-పూణే వికారాబాద్ వాడి సెక్షన్ అనంతగిరి కొండల నడుమ అద్భుతమైన దృశ్యం గుండా వెళుతుంది. పూణే – సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ పూణే నుండి ఉదయం 6 గంటలకు (మంగళవారం మినహా) బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 2.20కి.. రాత్రి 11.10కి పూణే చేరుకుంటుంది.

ఈ రైలులో ప్రయాణికులు ఉజ్ని బ్యాక్ వాటర్స్, భిగ్వాన్ సమీపంలోని ఆనకట్టలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆనందించవచ్చు. ఎల్‌ఈడీ లైట్లు, రొటేటబుల్, పుష్‌బ్యాక్ కుర్చీలు, ఎలక్ట్రికల్‌తో పనిచేసే ఆటోమేటిక్ స్లైడింగ్ కంపార్ట్‌మెంట్ డోర్లు, వైడ్ సైడ్ స్లైడింగ్ డోర్లు మొదలైన ఫీచర్లు ఈ కోచ్‌లో అందించబడ్డాయి. ఈ కోచ్‌లోని ప్రయాణికులు 360-డిగ్రీల కోణంలో వీక్షిస్తూ ఎంజాయ్‌ చేయవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి