Indian Railway: మీరు రైల్లో ప్రయాణం చేస్తున్నారా…? అయితే ఈ వివరాలు తప్పకుండా గుర్తించుకోవాలి

Indian Railway Guidelines : దేశ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. మరోవైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా.....

Indian Railway: మీరు రైల్లో ప్రయాణం చేస్తున్నారా...? అయితే ఈ వివరాలు తప్పకుండా గుర్తించుకోవాలి
Indian Railway

Edited By: Shiva Prajapati

Updated on: Apr 14, 2021 | 7:06 AM

Indian Railway Guidelines : దేశ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. మరోవైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా.. కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. వివిధ శాఖలు తమ వంతు జాగ్రత్త చర్యల్లో భాగంగా గైడ్‌లైన్స్‌ విధిస్తున్నాయి. వివిధ శాఖలు తమ వంతు జాగ్రత్త చర్యల్లో భాగంగా గైడ్‌లైన్స్‌ విధిస్తున్నాయి. అయితే కరోనా కేసుల నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన ఇండియన్‌ రైల్వేస్‌ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది.

రైల్వేలో కోవిడ్‌ గైడ్‌లైన్స్‌ ఇవే..
రైళ్లల్లో ప్రయాణించే వారికి కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదు. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన కరోనా నిబంధనలను మాత్రం ప్రతి ప్రయాణికుడు తప్పకుండా పాటించాలని రైల్వే శాఖ తెలిపింది. కోవిడ్‌ నేపథ్యంలో పరిశ్రభతకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రైళ్లల్లో ఆహారాన్ని వండే ప్రక్రియను నిలిపివేశారు. దీని స్థానంలో రెడీ టు ఈట్‌ (తినడానికి సిద్ధంఆ ఉన్న ఆహారం) ఫుడ్‌ను సరఫరా చేస్తారు.

రైల్వే స్టేషన్‌లలో మల్టీ పర్పస్‌ స్టాళ్లలో మాస్కులు, శానిటైజర్స్‌, గ్లౌవ్స్‌,బెడ్‌ రోల్‌ కిట్స్‌ అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్‌లలోనే ప్రయాణికులు వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రతి ప్రయాణికుడు మాస్క్‌ ధరించడం తప్పనిసరి. లేకపోతే జరిమానా విధిస్తారు. రైలు సర్వీసులను రద్దు చేసే ఆలోచన ఇప్పటికప్పుడే రైల్వే బోర్డుకు లేదు. ప్రయాణికులకు అవసరమైన సంఖ్యలోరైళ్లను నడిపించేందుకు రైల్వే శాఖ రెడీగా ఉంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే అదనపు రైలు సర్వీసులను నడిపించేందుకు సిద్ధంగా ఉంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యాప్తంగా రైల్వే శాఖ రోజూ 1,402 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇంకా 5,381 సబర్బన్‌ రైళ్లు, 830 ప్యాసింజర్‌ రైళ్లు ప్రతి రోజు రాకపోకలు కొనసాగిస్తున్నాయి.

ఇవీ చదవండి: Refund: వెంటనే డబ్బులు రిఫండ్ చేయండి.. విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం!

Bank Deposits: కరోనా టీకా వేసుకోండి..మాదగ్గర డిపాజిట్ చేయండి..ఎక్కువ వడ్డీ పొందండి.. ఆ బ్యాంక్ సూపర్ ఆఫర్!