ఈ ఏడాది హజ్ యాత్ర ఉండదు: కేంద్ర మంత్రి ప్రకటన

ఈ సంవత్సరం హజ్ యాత్ర ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కరోనా ప్రభావం నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు.

ఈ ఏడాది హజ్ యాత్ర ఉండదు: కేంద్ర మంత్రి ప్రకటన
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2020 | 2:54 PM

ఈ సంవత్సరం హజ్ యాత్ర ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కరోనా ప్రభావం నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నగదు మొత్తం డైరెక్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా వెనక్కి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

కాగా ఈ ఏడాది హజ్ యాత్ర కోసం 2300 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది అనుమతి లభించిన వారు అంతా 2021లో దానిని వినియోగించుకోవచ్చునని మంత్రి వివరించారు. అయితే కరోనా నేపథ్యంలో హజ్ యాత్రపై మొదటి నుంచి సంగ్ధిగ్ధత కొనసాగింది. హజ్ యాత్ర ఉండకపోవచ్చునని ప్రచారం జరిగింది. ఇక ఈ విషయంపై సౌదీ అరేబియా నుంచి సమాచారం కోసం భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఎదురుచూసింది. తాజాగా సౌదీ ప్రభుత్వమే వద్దని చెప్పడంతో యాత్రను రద్దు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

Read This Story Also: ఆస్ట్రేలియా వెళ్లిన ఎయిర్‌ ఇండియా ఫైలట్‌కు కరోనా పాజిటివ్