భారత్-చైనా కయ్యం.. ఇండో-అమెరికన్ ఆందోళన

| Edited By: Pardhasaradhi Peri

Jun 27, 2020 | 1:40 PM

ఇండియాతో గల  సరిహద్దుల్లో చైనా ఆక్రమణను అమెరికాలోని ప్రవాస భారతీయుడు  డా.అమీ బెరా ఖండించారు. సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు చైనా బలప్రయోగం కన్నా దౌత్య మార్గాలను పాటించాలని..

భారత్-చైనా కయ్యం.. ఇండో-అమెరికన్ ఆందోళన
Follow us on

ఇండియాతో గల  సరిహద్దుల్లో చైనా ఆక్రమణను అమెరికాలోని ప్రవాస భారతీయుడు  డా.అమీ బెరా ఖండించారు. సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు చైనా బలప్రయోగం కన్నా దౌత్య మార్గాలను పాటించాలని ఆయన ఆ దేశానికి సూచించారు. గాల్వన్ లోయలో ఈ నెల 15 న ఉభయ దేశాల దళాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘర్షణను తీవ్రంగా ఖండించిన అమీ బెరా.. ఇండియాతో చైనాకు దీర్ఘకాలంగా దౌత్య సంబంధాలు ఉన్నాయని, ఆ నేపథ్యంలో సరిహద్దు వివాదాలను డ్రాగన్ కంట్రీ శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అమెరికా ప్రతినిధుల సభలో అమీ బెరా సీనియర్ ఎంపీ.. ఆసియా వ్యవహారాలపైగల హౌస్ ఫారిన్ కమిటీ చైర్మన్ గా ఉన్న తాను…. చైనా చర్యల పట్ల ఆందోళన చెందుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. నియంత్రణ రేఖ పొడవునా ఉద్రిక్తతలు రేగడం ఉభయదేశాలకూ మంచిది కాదని, ఇది వ్యతిరేక ఫలితాన్నే ఇస్తుందని అయన హెఛ్చరించారు.

కాగా-ఇండో-చైనా దళాల ఘర్షణపై ఇప్పటివరకు అమెరికా ప్రతినిధుల సభలో పెద్దగా చర్చ జరగలేదు. ఆ రెండు దేశాలూ శాంతియుతంగా తమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలని మాత్రం రిపబ్లికన్, డెమొక్రటిక్ ఎంపీలు కోరుతున్నారు.