Prithvi-2 Missile: షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పృథ్వీ-2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్‌లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం రాత్రి 7.40 గంటలకు డీఆర్డీవో మిస్సైల్‌ను పరీక్షించగా.. విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దేశీయంగా అభివృద్ధి చేసింది. నిర్దేశిత లక్ష్యాలను ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టిందని తెలిపింది. పరీక్ష సమయంలో క్షిపణి సూచించిన అన్ని కార్యాచరణ, సాంకేతిక పారామితులను కలిగి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ క్షిపణిని గత ఏడాది నవంబర్, డిసెంబర్లలో కూడా విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్.. 350 కిలోమీటర్ల పరిధిలోకి రేంజ్‌ను కలిగి ఉంటుంది. రెండు లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్లను కలిగిన పృథ్వీ-2.. 500/100 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. 9 మీటర్ల పొడవు, సింగిల్-స్టేజ్ ద్రవ ఇంధనంతో పనిచేసే పృథ్వీ-2 మిస్సైల్ తొలిసారిగా 1996లో ప్రయోగించారు. 2003లో భారత సాయుధ దళాలలోకి ప్రవేశించింది. DRDO అభివృద్ధి చేసిన మొదటి క్షిపణి ఇదే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి