Covid 4th Wave: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. గత 24 గంటల్లో ఎంతమంది చనిపోయారంటే..?

శనివారం దేశవ్యాప్తంగా 16,103 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 31 మంది మరణించారు. శుక్రవారంతో పోల్చుకుంటే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.

Covid 4th Wave: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. గత 24 గంటల్లో ఎంతమంది చనిపోయారంటే..?
India Corona Update

Updated on: Jul 03, 2022 | 10:34 AM

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ తర్వాత భారీగా తగ్గిన కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. గత 24 గంటల్లో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శనివారం దేశవ్యాప్తంగా 16,103 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 31 మంది మరణించారు. శుక్రవారంతో పోల్చుకుంటే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,11,711 (0.26 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.27 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.54 శాతం, మరణాలు 1.21 శాతం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశంలో నమోదైన కరోనా గణాంకాలు..

ఇవి కూడా చదవండి
  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,35,02,429 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,199 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 13,929 మంది బాధితులు కోలుకున్నారు.
  • కోలుకున్న వారి సంఖ్య 4,28,65,519 కి చేరింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 197,95 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • నిన్న 10,10,652 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us