India Corona Cases: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా ప్రభావం.. 30వేలకు పడిపోయిన పాజిటివ్ కేసులు..

|

Jul 05, 2021 | 10:12 AM

India Corona Cases: భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా దేశ వ్యాప్తంగా..

India Corona Cases: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా ప్రభావం.. 30వేలకు పడిపోయిన పాజిటివ్ కేసులు..
Coronavirus In India
Follow us on

India Corona Cases: భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 39,796 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక రికవరీలు భారీగా పెరిగాయి. 42,352 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 723 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సోమవారం నాడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,05,85,229 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 2,97,00,430 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,82,071యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వైరస్ తీవ్రతతో 4,02,728 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా పాజిటివ్ రేటు 1.58 శాతం ఉండగా.. రికవరీ రేటు 97.11 శాతంగా ఉంది. అదే సమయంలో మరణాల రేటు 1.32 శాతంగా ఉంది.

ఇక కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. కోవిండ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తూనే.. మరోవైపు వ్యాక్సీనేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. వ్యాక్సీన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ.. అందరికీ వ్యాక్సీన్ వేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 14,81,583 డోసుల వ్యాక్సీన్ వేయగా.. దేశంలో కోవిడ్ వ్యాక్సీనేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 35,28,92,046 కోవిడ్ వ్యాక్సీన్ డోసులు వేశారు.

India Corona Cases:

Also read:

ఆంక్షలు ఎత్తేస్తాం.. కోవిద్ వైరస్ తో కలిసి జీవించడం నేర్చుకోండి.. ప్రజలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హితవు

Gold Carats: 24 క్యారెట్ల బంగారం.. 22 క్యారెట్ల బంగారానికి తేడా ఏమిటి..? క్యారెట్‌ అంటే ఏమిటి..?

Viral Video: మట్టిలో తెగ ఎంజాయ్ చేస్తున్న గున్న ఏనుగు.. ముచ్చటేస్తున్న వీడియోకు నెటిజన్లు ఫిదా..