India Corona Cases: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజు వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు స్థిరంగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16,49,295 సాంపిల్స్ పరీక్షించగా.. 30,549 మందికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక కరోనా వైరస్ ప్రభావతో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 38,887 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,04,958 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు 3,17,26,507 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 3,08,96,354 మంది కోలుకున్నారు.
వైరస్ ప్రభావంతో చనిపోయిన వారి సంఖ్య 4,25,195 లకు చేరింది. దేశంలో కరోనా పాజిటివ్ రేటు 1.28 శాతం ఉండగా.. రికవరీ రేటు 97.38 శాతంగా ఉంది. ఇదే సమయంలో మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 61,09,587 వ్యాక్సీన్ డోసులు వేశారు. దాంతో ఇప్పటి వరకు దేశంలో 47,85,44,114 వ్యాక్సీన్ డోసులను వేశారు.
ANI Tweet:
India reports 30,549 new #COVID19 cases, 38,887 discharges & 422 deaths in last 24 hours as per Union Health Ministry
Total cases: 3,17,26,507
Total discharges: 3,08,96,354
Death toll: 4,25,195
Active cases: 4,04,958Total Vaccination: 47,85,44,114 (61,09,587 in last 24 hours) pic.twitter.com/lkS8eBMZh9
— ANI (@ANI) August 3, 2021
Also read: