Fact Check: అవన్నీ ఫేక్ వీడియోలు.. నమ్మొద్దు.. ఇవిగో ప్రూఫ్స్

ఇండియన్ ఆర్మీ పోస్ట్‌‌ను పాక్ ధ్వంసం చేసింది. 50 మందికి పైగా భారత్ జవాన్లను పాకిస్తాన్ ఆర్మీ దాడిలో చనిపోయారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ఇండియన్ ఆర్మీ బేస్ మీద ఇంతవరకు పాకిస్తాన్ తాకలేకపోయింది. పాక్ కుటిల ప్రయత్నాలన్నింటినీ భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. కానీ ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించేలా వీడియోలను ప్రచారం చేస్తున్నారు.

Fact Check: అవన్నీ ఫేక్ వీడియోలు.. నమ్మొద్దు.. ఇవిగో ప్రూఫ్స్
Fact Check

Updated on: May 09, 2025 | 11:51 AM

పంజాబ్‌లోని జలంధర్‌పై పాకిస్తాన్ దాడి చేసిందంటూ ఓ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఇది నిజం కాదు. ఓ పంట పొలంలో వ్యర్థాలను తగలబెడుతున్న వీడియో ఇది.

భారత్‌ దాడిని తిప్పికొడుతూ పాకిస్తాన్ దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ భారీ ఎక్స్‌ప్లోజివ్ బ్లాస్ట్ చేసిందంటూ కొందరు పోస్ట్ చేశారు. కానీ అది నిజం కాదు. 2020లో లెబనాన్‌లోని బీరట్‌లో జరిగిన పేలుడికి సంబంధించిన వీడియో ఇది.

రాజౌరీలోని భారత్ ఆర్మీ క్యాంప్‌పై పాక్ ఆత్మాహుతి దాడి చేసిందంటూ మరో పోస్ట్ సోషల్ మీడియాలో తిరుగుతోంది. కానీ అది కూడా పూర్తిగా తప్పుడు కథనం.

హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్ నుంచి తమ పౌరులపైనే భారత్ దాడి చేసిందంటూ మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. భారత్ ఎదురుదాడిని తట్టుకోలేని పాక్.. ఇలాంటి తప్పుడు పోస్టులు సృష్టిస్తోంది.

యుద్ధవాతావరణం నేపథ్యంలో ఇండియాలోని అన్ని ఎయిర్‌పోర్టులు మూసేశారంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టు కూడా పూర్తి అబద్ధమే. ఇండియాలో అన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో విమాన రాకపోకలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి.

సైన్యం సన్నద్ధతపై ఆర్మీ చీఫ్ వీకే నారాయన్ పంపిన ఓ కాన్ఫిడెన్షియల్ లెటర్‌ బయటకు వచ్చిందంటూ.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. జనరల్ వీకే. నారాయన్ అసలు ఆర్మీ చీఫే కాదు.