ఇండో-జపాన్ రక్షణ ఒప్పందం

|

Sep 10, 2020 | 9:25 PM

ఇండియా, జపాన్‌ గురువారం రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఫలితంగా ఇరు దేశాలు ఇకపై రక్షణ పరికరాలు, సేవలను ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ ఒప్పందం ద్వారా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సామరస్యం..

ఇండో-జపాన్ రక్షణ ఒప్పందం
Follow us on

ఇండియా, జపాన్‌ గురువారం రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఫలితంగా ఇరు దేశాలు ఇకపై రక్షణ పరికరాలు, సేవలను ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ ఒప్పందం ద్వారా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తాయని ఇరుదేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈ రక్షణ ఒప్పందాన్ని భారత, జపాన్ దేశాధినేతలు స్వాగతించారని అధికారిక ప్రకటన పేర్కొంది. రక్షణ ఒప్పందం నేపథ్యంలో అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్‌ ప్రధాని అబే షింజో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చొరవ చూపారంటూ షింజో అబేను మోదీ ప్రశంసించారు. ఇరువురు నేతలు ముంబై-అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు సహా ఇరు దేశాల మధ్య సహకారంపైనా సమీక్షించారు. భారత్‌-జపాన్‌ భాగస్వామ్యం ఇక ముందు కూడా పరిఢవిల్లుతుందని మోదీ, అబే విశ్వాసం వ్యక్తం చేశారు.