Zero Rupee Note: మనదేశంలో జీరో రూపీ నోట్ ఉందని తెలుసా.. ఈ నోటు ఎక్కడ దొరుకుంటుంది.. ఎలా వాడాలంటే..

|

Aug 19, 2021 | 9:22 AM

Zero Rupee Note: రూపాయి, రెండు రూపాయల నోట్లు తగ్గాయి కానీ.. పది, 20, 50, 100, 200, 500, 2వేల రూపాయల నోటు వరకూ భారతీయులకు తెలుసు. అయితే మనదేశంలో జీరో రూపాయి..

Zero Rupee Note: మనదేశంలో జీరో రూపీ నోట్ ఉందని తెలుసా.. ఈ నోటు ఎక్కడ దొరుకుంటుంది..  ఎలా వాడాలంటే..
Zero Rupee Note
Follow us on

Zero Rupee Note: రూపాయి, రెండు రూపాయల నోట్లు తగ్గాయి కానీ.. పది, 20, 50, 100, 200, 500, 2వేల రూపాయల నోటు వరకూ భారతీయులకు తెలుసు. అయితే మనదేశంలో జీరో రూపాయి నోట్ అనేది ఒకటుందన్న విషయం చాలా మందిభారతీయులకు తెలియదు.సైలెంట్ రివల్యూషన్‌లా విస్తరిస్తున్న జోరో రూపాయి అంటే ఏమిటి.. ఈ నోటుని ఎప్పుడు ఎలా ఉపయోగిస్తారు ఈరోజు తెలుసుకుందాం

ప్రభుత్వ అధికారులు లంచం అడగడం,… ప్రజలు లంచం ఇవ్వడం మన దేశంలో సర్వసాధారణ విషయంగా మారిపోయింది. అయితే లంచం అడగడం, ఇవ్వడం రెండూ చట్టప్రకారం నేరమే. అమెరికాలో జాబ్ చేసిన సాఫ్ట్‌వేర్ ఎన్నారై ఆనంద్.. భారత్ కు వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న అవినీతిని చూసి ఆశ్చర్యపోయారు. దీనికి ఎలా బ్రేక్ వెయ్యాలి అని ఆలోచించిన ఆనంద్ ఫిఫ్త్ పిల్లర్ అనే స్వచ్ఛంద సంస్థను 2007లో స్థాపించారు. ఈ సంస్థ.. జీరో రూపీ నోట్లను తయారుచేస్తోంది. ఈ నోట్లు రెగ్యులర్ కరెన్సీలాగా చెల్లవు. వీటిపై అమౌంట్ బదులు జీరో ఉంటుంది. చూడటానికి రూ.50 నోటు లాగా ఉంటుంది. ఈ నోట్లపై నేను లంచం ఇవ్వను, తీసుకోను అనే ప్రమాణం రాసి ఉంటుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగితే.. ఈ నోట్లను ఇవ్వండి అని కోరుతున్నారు ఆనంద్. వీటిని ఇచ్చే ముందు అవినీతి నిరోధక వ్యవస్థ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అలా ఈ జీరో నోట్లను అధికారికి లంచం ఇచ్చిన తర్వాత అతని లంచావతారం సంగతి అధికారులు చూసుకుంటారని ఆనంద్ చెబుతున్నారు.

2007 నుంచి 2014వరకూ ఫిఫ్త్ పిల్లర్ సంస్థ 25 లక్షల నోట్లను ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చింది. ఈ నోట్లను మొదటిసారి చెన్నైలో ఉపయోగించారు. అక్కడ సక్సెస్ అవ్వడంతో మరింతగా నోట్ల ముద్రణని విస్తరించారు. అనంతరం తమిళంతోపాటూ… తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నోట్లను ప్రింట్ చేస్తున్నారు.

ఒక్క భారత్ లోనే కాదు ఈ ఫిఫ్త్ పిల్లర్ సంస్థ మెక్సికో, నేపాల్ వంటి దేశాల్లో కూడా జీరో నోట్లను ముద్రించి ఇస్తోంది. 2020లో భారత్ లో అవినీతి ఏ రేంజ్ లో ఉంది అనే అంశంపై ఈ సంస్థ అధ్యయనం జరిపించగా… సంవత్సరానికిరూ.490 కోట్ల అవినీతి జరుగుతోందని తేలింది.

లంచంగా ఈ నోట్లే ఎందుకు ఇవ్వాలంటే..

అధికారులు లంచం అడిగినప్పుడు.. ఏసీబీ అధికారులకు చెప్పినా, చెప్పకపోయినా.. లంచం ఇవ్వడం నేరం. కనుక ఏసీబీ అధికారులు పట్టుకుంటే ఆ అవినీతి అధికారి “అతను లంచం ఇచ్చాడు కనుకనే నేను తీసుకున్నాను. అందుకని లంచం ఇచ్చినందుకు అతన్ని కూడా అరెస్టు చెయ్యాలి” అని మెలిక పెట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ జీరో నోట్లను ఇస్తే.. లంచం ఇచ్చినట్లు అవ్వదు. ఎందుకంటే ఆ నోటుకు విలువ లేదు కనుక .అదే సమయంలో.. అవినీతి అధికారి బండారం బయటపెట్టినట్లూ అవుతుంది అన్నది ఈ జీరో రూపీ నోట్ కాన్సెప్ట్. దీనికి యువత నుంచి మంచి స్పందన వస్తోంది.

భారత్ లో అవినీతి జీరో అవ్వాలి అనే ఉద్దేశంతో.. జీరో రూపీ నోట్ అని పేరు పెట్టారు. ఈ జీరో రూపీ నోట్లను ఈ సంస్థ… రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మార్కెట్ ప్లేసుల్లో ఉచితంగా ఇస్తోంది. తద్వారా ప్రజల్లో దీనిపై అవగాహన కల్పిస్తోంది. ఎవరికైనా ఈ నోట్లు కావాలంటే… సంస్థ వెబ్‌సైట్‌ (https://5thpillar.org)లోకి వెళ్లి అడగవచ్చు. చేయి చేయి కలుపుదాం.. మనదేశంలో అవినీతిని రహిత సమాజాన్ని నిర్మిద్దాం.

Also Read: వరలక్ష్మి వత్ర విశిష్టత, పూజా విధానం.. తోరం కట్టుకునే పధ్ధతి తెలుసుకుందాం