విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహిస్తూ ఇతర దేశాల్లో ఉండి ఆపదలో ఉన్న ఎంతోమందికి సహాయం చేసిన సుష్మా స్వరాజ్. గీత అనే యువతికి చేసిన సాయం ఎన్నటికీ మరచిపోలేం. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమై ఎక్కడో పాకిస్తాన్‌లో ఉన్న బదిర యువతిని భారత్‌కు రప్పించడం చూస్తే.. ఆమెలోని మానవత్వం ఇట్టే అర్ధమవుతుంది. అయితే సుష్మా ఇకలేరనే వార్త బదిర యువతి గీతకు తెలిసి కన్నీటి పర్యంతమైంది. మాటలు రాకపోయినా ఏదో చెప్పాలనే తాపత్రయంతో చేసిన సంఙ్ఞలు అందరికీ కన్నీటిని రప్పించాయి. ” నా తల్లి ఇక లేరు” అంటూ తన మూగ మనసులోని ఆవేదన వ్యక్తం చేసింది గీత.
#WATCH Indore: Geeta, the Indian girl who was brought back from Pakistan in 2015 when late Sushma Swaraj was External Affairs Minister, pays tribute. #MadhyaPradesh pic.twitter.com/OtksbYMpff
— ANI (@ANI) August 7, 2019