Afghanistan Crises: ఎమర్జెన్సీ వీసాలు జారీ చేసిన భారత హోంశాఖ.. అఫ్ఘాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 142మంది ప్రవాసులు

|

Aug 17, 2021 | 12:56 PM

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. అక్కడున్న మన అధికారులను స్వదేశానికి తీసుకొచ్చింది.

Afghanistan Crises: ఎమర్జెన్సీ వీసాలు జారీ చేసిన భారత హోంశాఖ.. అఫ్ఘాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 142మంది ప్రవాసులు
Afghanistan Crises Indians Return
Follow us on

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. అక్కడున్న మన అధికారులను స్వదేశానికి తీసుకొచ్చింది. 142 మంది భారత అధికారులున్న వాయుసేన యుద్ధ విమానం కాబూల్​ విమానాశ్రయం నుంచి గుజరాత్​లోని జామ్​నగర్ చేరుకుంది..

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానంలో అఫ్ఘానిస్థాన్‌లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎంబసీ సిబ్బంది, ఐటీబీపీ జవాన్లు మొత్తం 142 మందితో సీ-17 విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ చేరుకుంది. కాగా, కాబూల్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వీరిని సోమవారం సాయంత్రమే సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాజాగా వారందరిని సీ-17 విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు. ఇక తాలిబన్లు తిరిగి అఫ్ఘానిస్థాన్‌లో పాగ వేయడంతో ఆ దేశంలోని ప్రజలు విదేశాలకు వెళ్లిపోతున్నారు. తాలిబన్ల పాలనలో తాము బతికిబట్టకట్టలేమని వాపోతున్నారు.

20 ఏళ్ల కింద తాలిబన్ల అరాచక పాలన నుంచి విముక్తి పొందిన అఫ్ఘాన్ ప్రజలు.. రెండు దశాబ్ధాల తర్వాత మళ్లీ వారి చేతుల్లోకి దేశం వెళ్లిపోవడంతో అక్కడ ఉండలేమంటూ విదేశాలకు తరలిపోతున్నారు. అఫ్గానిస్థాన్​లో చిక్కుకున్న భారత అధికారులను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది కేంద్రం. ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసి.. 120 మంది అధికారులను కాబూల్​ విమానాశ్రయం నుంచి సీ-17 యుద్ధ విమానంలో భారత్ తీసుకొచ్చింది. గుజరాత్​ జామ్​నగర్​లో ఈ విమానం ల్యాండ్ అయింది. వీరందరినీ సోమవారం సాయంత్రమే విమానాశ్రయంలో సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం విమానం బయలుదేరే వరకు వారికి భద్రత కల్పించారు.

అఫ్గాన్..తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కొత్త కేటగిరీ వీసాలను ప్రకటించింది కేంద్ర హోంశాఖ. భారత్​కు రావాలనుకునే అఫ్గానీల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఎలక్ట్రానిక్​ వీసా విధానాన్ని తీసుకొచ్చింది. ‘ఇ-ఎమర్జెన్సీ ఎక్స్​-మిస్క్​ వీసా’ పేరుతో దీన్ని ప్రకటించింది. అఫ్గాన్​లో ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 20 ఏళ్ల తర్వాత తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రాణభయంతో దేశం వీడి వెళ్లిపోవాలని సోమవారం కాబూల్ ఎయిర్​ పోర్టుకు వేల సంఖ్యలో అఫ్గానీలు వచ్చారు. దీంతో విమానాశ్రయం బస్​ స్టేషన్​ను తలపించింది. కొందరైతే విమానం రెక్కలు పట్టుకుని అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే విమానం టేకాఫ్ అయ్యాక కిందపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Read Also.. లగ్జరీ కార్ల టాక్స్ దొంగలు…! స్పెషల్ డ్రైవ్ చేపట్టిన తెలంగాణ ట్రాన్స్ పోర్ట్..:Tax Fraud By Luxury Cars Video.

Gandhi Hospital: గాంధీ ఆసుపత్రి అక్కా చెల్లెల్ల ఆత్యాచారం కేసులో వెలుగులోకి వస్తున్న సంచలనాలు.. ఇంకా జాడలేని అక్కా!