India Covid-19: ఒక్కరోజే మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు.. రెండు వేల మార్క్ దాటిన మరణాల సంఖ్య

India Coronavirus updates: దేశంలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత ఐదు రోజుల నుంచి నిత్యం రెండు లక్షలకుపైగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో

India Covid-19: ఒక్కరోజే మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు.. రెండు వేల మార్క్ దాటిన మరణాల సంఖ్య
Coronavirus India

Updated on: Apr 21, 2021 | 11:16 AM

India Coronavirus updates: దేశంలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత ఐదు రోజుల నుంచి నిత్యం రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నిన్న కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో మూడు లక్షల మార్కుకు చేరువ కాగా..  రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గత 24 గంటల్లో (మంగళవారం).. 2,95,041 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2,023 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజుల తరువాత మరణాల సంఖ్య రెండు వేలు దాటడం ఇదే మొదటిసారి. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,56,16,130 (1.56 కోట్లు) కు చేరగా.. మరణాల సంఖ్య 1,82,553 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

నిన్న కరోనా నుంచి 1,67,457 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,32,76,039 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,57,538 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 16,39,357 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 20 వరకు మొత్తం 27,10,53,392 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశ్యాప్తంగా.. 13,01,19,310 డోసులను లబ్ధిదారులకు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై పలు చర్యలు తీసుకుంటోంది.

Also Read:

Criminal: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బాత్రూమ్ కిటికీ నుంచి దూకిన నేరస్థుడు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Plasma Therapy: ప్లాస్మా అంటే ఏమిటి.. కరోనా పేషేంట్స్ చికిత్స కు ఎందుకు ఉపయోగిస్తారంటే..