‘సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేదు’.. దేశంలో మళ్లీ పెరిగిన మరణాలు.. గుబులు పుట్టిస్తున్న కొత్త వేరియంట్లు.!

India Corona Cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేదని.. రాష్ట్రాలు వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది.

సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేదు.. దేశంలో మళ్లీ పెరిగిన మరణాలు.. గుబులు పుట్టిస్తున్న కొత్త వేరియంట్లు.!
India Corona Updates

Updated on: Jul 10, 2021 | 10:37 AM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేదని.. రాష్ట్రాలు వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపధ్యంలోనే తాజాగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు మరోసారి ప్రజల్లో గుబులు రేపుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,766 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,206 మరణాలు సంభవించాయి.

మొన్న 811, నిన్న 911, ఈరోజు 1206 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. కరోనా వల్ల మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు పలు సూచనలు ఇచ్చింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. ప్రతీ రాష్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని..కరోనా నిబంధనల్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కఠిన ఆంక్షలు అమలు చేయాలని తెలిపింది.

ఇదిలా ఉంటే నిన్న నమోదైన కేసులతో కలిపి మొత్తంగా ఇప్పటివరకు 3,07,95,716 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,55,033 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే శుక్రవారం 45,254 మంది వైరస్ నుంచి కోలుకోగా.. రికవరీ కేసుల సంఖ్య 2,99,33,538కి చేరింది. అటు తాజా మరణాలతో 4,07,145కి మృతుల సంఖ్య చేరింది.

మరోవైపు కేరళలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. నిన్న 13,563 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 130 మంది వైరస్ కారణంగా మరణించారు. అటు ఇప్పటిదాకా 37,21,96,268 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.20 శాతంగా ఉంది. అలాగే మరణాల రేటు 1.32గా ఉంది.

Also Read:

లైవ్‌లో చిరుత వేటను మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ షాకింగ్ వీడియో చూడండి.!

పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. ప్రతీ నెల రూ. 2 వేలు జమతో.. రూ. 1.39 లక్షలు పొందొచ్చు.!

Loading...
Unable to load recommendations.
Follow Us