Smartphone: స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్‌.. చైనాను వెనక్కి నెట్టి మరీ..

ఒకప్పుడు స్మార్ట్ ఫోన్‌ తయారీ అంటే ముందుగా గుర్తొచ్చే దేశం చైనా. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. స్మార్ట్‌ఫోన్స్‌ తయారీలో భారత్‌ దూసుకుపోతోంది. స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతుల్లో చైనా, వియత్నాంలను భారత్‌ వెనక్కి నెట్టింది. ఇటీవల ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2024లో భారతదేశ మొబైల్...

Smartphone: స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్‌.. చైనాను వెనక్కి నెట్టి మరీ..
Smartphone Exports
Follow us

|

Updated on: Jul 01, 2024 | 7:35 PM

ఒకప్పుడు స్మార్ట్ ఫోన్‌ తయారీ అంటే ముందుగా గుర్తొచ్చే దేశం చైనా. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. స్మార్ట్‌ఫోన్స్‌ తయారీలో భారత్‌ దూసుకుపోతోంది. స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతుల్లో చైనా, వియత్నాంలను భారత్‌ వెనక్కి నెట్టింది. ఇటీవల ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2024లో భారతదేశ మొబైల్ ఎగుమతి 40 శాతానికి పైగా ఉండగా, చైనాలో మొబైల్ ఎగుమతులు 2.78 శాతం పడిపోవడం గమనార్హం.

ఇక వియత్నాం విషయానికొస్తే మొబైల్ ఎగుమతుల్లో 17.6 శాతం క్షీణించింది. మొబైల్ ఎగుమతుల విషయంలో చైనా, వియత్నాం రెండూ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. మొబైల్ ఎగుమతి మార్కెట్‌లో ఈ రెండు దేశాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. అయితే ఇప్పుడు భారత్ చైనా, వియత్నాంలు రెండు దేశాల ఆధిపత్యాన్ని అధిగమించి మొదటి స్థానంలో నిలవడం విశేషం.

చైనా, వియత్నం వంటి దేశాలను భారత్‌ అధిగమించడానికి ప్రధాన కారణాల్లో పీఎల్‌ఐ పథకం కీలక పాత్ర పోషించిందని నిపుణులు చెబుతున్నారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా దేశంలో ఉపాధిని పెంచుతున్నారు. విదేశీ కంపెనీలను ప్రోత్సహించడమే కాకుండా, దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ పథకం ఉపయోగపడింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారానే ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్‌ కంపెనీలైనా యాపిల్‌, వివో, షావోమీ, సామ్‌సంగ్‌లు స్థానికంగా స్మార్ట్‌ ఫోన్‌లను ఉత్పతి చేయడం ప్రారంభించాయి.

ఇదిలా ఉంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ డేటా ప్రకారం.. 2023లో ప్రపంచంలో మొబైల్ ఎగుమతులు $136.3 బిలియన్లుగా ఉన్నట్లు తేలింది. అయితే ఆ తర్వాత 2024 నాటికి ఇది క్షీణించింది. దీని తర్వాత ఈ సంఖ్య 132.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. వియత్నంలో 2023లో మొబైల్ ఎగుమతులు 31.9 శాతంగా ఉండగా 2024 నాటికి 26.27 శాతానికి తగ్గింది. ఇక భారత దేశానికి విషయానికొస్తే.. 2023లో భారతదేశం నుంచి 11.1 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఎగుమతులు జరగగా, 2024లో $15.6 బిలియన్లకు పెరిగింది. ఈ లెక్కన ఏడాదిలో భారత్‌ 4.5 శాతం వృద్ధిని సాధించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..