03 July 2024
బుల్లితెర అందాల రాక్షసి.. జానకి కలగనలేదు ఫేమ్ విష్ణుప్రియ అద్భుతం..
Rajitha Chanti
Pic credit - Instagram
బుల్లితెరపై ఆమె అందాల రాక్షసి. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. తనే విష్ణుప్రియ.
జానకి కలగనలేదు సీరియల్లో మల్లికగా.. త్రినయని సీరియల్లో హాసినిగా తన నటనతో తెలుగు ఫ్యామిలీ అడియన్స్‌కు దగ్గరైంది.
తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సీరియల్స్‌లో నటించింది. తోటి నటుడు సిద్ధార్థ వర్మతోను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు.
పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది విష్ణు ప్రియ
అటు సీరియల్స్ చేస్తూ.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది కూడా.
తాజాగా తన ఇన్ స్టాలో విష్ణు ప్రియ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. బంతిపూల మధ్యలో చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తుంది.
యదుకుమారుడే లేని వేళలో….! వెతలు రగిలెనే రాధ గుండెలో…!! పాపం రాధా.. అంటూ సాంగ్ లిరిక్స్ రాసుకొచ్చింది విష్ణు ప్రియ.
కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది విష్ణు ప్రియ. బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకోవడానికి దాదాపు రెండేళ్లు పట్టిందని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి.