ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి బుసలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. చైనాలోని వ్యూహన్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్తవేరియంట్లతో దేశంలో ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కావాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఫార్మ కంపెనీ అయిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన రెండు చుక్కల నాసికా టీకాకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో నిర్వహిస్తున్న టీకాఇ కార్యక్రమంలో భాగంగా ఇది శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ చుక్కల టీకా ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండనుంది. అప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్నవారు ఈ నాసికా టీకాను హెటిరోలాగస్ బూస్టర్‌గా తీసుకోవచ్చని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే భారత్ బయోటెక్ డెవలప్ చేసిన ఈ చుక్కల మందు టీకా ఇన్‌కొవాక్‌ను బూస్టర్ డోసుగా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నవంబర్‌లో అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దీనికి కేంద్రం ఆమోదం లభించగా.. శుక్రవారం సాయంత్రం నుంచి కొవిన్ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి రానుంది. ఈ టీకాను 18 ఏళ్ల దాటిన వారు ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల్లో 81.2 శాతం కొత్త కేసులు కేవలం పది దేశాల్లోనే వెలుగు చూస్తున్నాయని, ఇందులో జపాన్ ముందు వరుసలో ఉందని కేంద్రం తెలిపింది. కొత్త కేసులు నమోదువుతున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపడుతోంది. కరోనా కేసులు పెరగకుండా చర్యలు చేపడుతోంది. అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి