సరిహద్దులో ఉద్రిక్తతల నివారణకు అంగీకారం

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 4:00 PM

భారత్‌- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులను తగ్గించేందుకు రెండు దేశాల మధ్య పరస్పర ఒప్పందం కుదిరింది. ఐదు అంశాలతో కూడిన ప్రణాళికను ఆయా దేశాల ప్రతినిధులు ఖరారు చేశారు.

సరిహద్దులో ఉద్రిక్తతల నివారణకు అంగీకారం
Follow us on

భారత్‌- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులను తగ్గించేందుకు రెండు దేశాల మధ్య పరస్పర ఒప్పందం కుదిరింది. ఐదు అంశాలతో కూడిన ప్రణాళికను ఆయా దేశాల ప్రతినిధులు ఖరారు చేశారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రెండు దేశాలకు మంచిది కాదనే విషయాన్ని చైనా స్వచ్చందంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. తక్షణమే ఎల్ఓసీ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. జూన్‌ 17 తర్వాత నుంచి సుమారు 4నెలలుగా అక్కడ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్యాంగాంగ్‌ సరస్సు కేంద్రంగా రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించడంతో సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఈ సమయంలో చైనా-భారత్‌ మధ్య తాజా ఒప్పందం కుదరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎల్ఓసీ నుంచి రెండు దేశాల సైన్యాలు సమదూరం పాటించాలని నిర్ణయించారు. సరిహద్దు వివాదంపై పరస్పరం చర్చలు కొనసాగించేందుకు అంగీకరించారు. ఎస్‌సీఓ సమావేశాల సందర్భంగా మాస్కోలో రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు సెర్గీ లెవ్రోవ్, జైశంకర్, వాంగ్‌ సమావేశమయ్యారు.

తూర్పు లడఖ్‌లో సుదీర్ఘ సరిహద్దు ముఖాముఖిని పరిష్కరించడానికి భారత్‌, చైనా చైనా ఐదు పాయింట్ల ప్రణాళికపై అంగీకరించాయి. ఇందులో సరిహద్దుల నిర్వహణపై ఇప్పటికే ఉన్న అన్ని ఒప్పందాలు, ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండటం, శాంతితో పాటు ప్రశాంతతను కాపాడుకోవడం, విధ్వేషాలను పెంచే ఏ చర్యను నివారించడం వంటి వాటిపై చర్చించారు. సరిహద్దు ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితి రెండు దేశాలకు మంచిది కాదని చైనా, భారత్ విదేశాంగ మంత్రులు అంగీకరించారు.

ఈ నేపథ్యంలో ఇరుపక్షాల సరిహద్దు దళాలు తమ సంభాషణను కొనసాగించాలని సరైన దూరాన్ని పాటించడంతో పాటుగా ఉద్రిక్తతలను తగ్గించాలని వారు నిర్ణయించారు. భారత్-చైనా సంబంధాలను అభివృద్ధి చేయడంలో ఇరు దేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం నుండి ఇరువర్గాలు మార్గదర్శకత్వం తీసుకోవాలని జైశంకర్, వాంగ్ అంగీకరించినట్లుగా ఉమ్మడి ప్రకటన తెలిపింది.