Azadi Ka Amrit Mahotsav: క్విట్ ఇండియా ఉద్యమం నాడు తులం రూ.44 ల నుంచి నేటి వరకూ పసిడి ధర జర్నీ ఏ విధంగా సాగిందంటే..

|

Aug 15, 2022 | 12:40 PM

బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ ఈనాటిది కాదు.. మన పూర్వీకుల నుంచి వస్తుందే..ఈరోజు మనం 76వ స్వాతంత్య దినోత్సవ వేడుకను జరుపుకుంటున్నాం.. ఈ సందర్భంగా స్వాతంత్య్రం వచ్చినప్పుటి నుంచి నేటి వరకూ మనదేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Azadi Ka Amrit Mahotsav: క్విట్ ఇండియా ఉద్యమం నాడు తులం రూ.44 ల నుంచి నేటి వరకూ పసిడి ధర జర్నీ ఏ విధంగా సాగిందంటే..
Gold Jwelary Ornaments
Follow us on

Azadi Ka Amrit Mahotsav: భారతీయులకు, బంగారానికి అవినాభావ సంబంధం ఉంది.. ఇంకా చెప్పాలంటే.. భారతీయులకు పసిడిపై ఉన్న మక్కువ గురించి ప్రపంచ దేశాలు ప్రత్యేకంగా చెప్పుకుంటాయంటే కూడా అతిశయోక్తికాదు.. బంగారాన్ని అలంకారానికి పనికి వచ్చే లోహంగా చూడరు.. తమ జీవితంలో ఒక భాగంగా భావిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.. పండగలు, ఫంక్షన్లు ఇలా ఏ సందర్భంలోనైనా తమ స్థాయికి తగినట్లు పసిడికొనుగులుకు ఆసక్తిని చూపిస్తారు. అయితే ఇలా బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ ఈనాటిది కాదు.. మన పూర్వీకుల నుంచి వస్తుందే.. బంగారాన్ని స్టేటస్ సింబల్ గానే కాదు.. ఆర్ధిక భరోసానిచ్చేదిగా భావిస్తారు.. ఆధ్యాత్మికంగా కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు మనం 76వ స్వాతంత్య దినోత్సవ వేడుకను జరుపుకుంటున్నాం.,. ఈ సందర్భంగా స్వాతంత్య్రం వచ్చినప్పుటి నుంచి నేటి వరకూ మనదేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

దేశంలో స్వాతంత్య్రం వచ్చిన అప్పటికీ, ఇప్పటికీ అన్ని విషయాల్లోనూవు పరిస్థితులు మారిన మాట వాస్తవమే.. అయినప్పటికీ . బంగారం ధరల్లో మార్పులు ఏ రేంజ్ లో చోటు చేసుకున్నాయి తెలుసుకుంటే.. ఆమ్మో అనిపించకమానదు ఎవరికైనా..

ప్రపంచంలోని అతిపెద్ద బంగారం దిగుమతిదారుల్లో భారతదేశం ఒకటి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల మాదిరిగానే ఇంట్లో బంగారం విలువ కూడా మారుతూ ఉంటుంది. ద్రవ్యోల్బణం బంగారం ధరతో ముడిపడి ఉంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు, బంగారం ధరకూడా పెరుగుతూనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ. 44లు మాత్రమే.. అనంతరం ఐదేళ్ళలో అంటే 1947కి  ఈ ధర రెట్టింపు అంటే రూ.88లకు చేరుకుంది. కాలక్రమేణా బంగారం విలువైన ఆస్తిగా భావించడం మొదలు పెట్టారు. ఇప్పుడు బంగారాన్ని ఒక పెట్టుబడిగా భావిస్తున్నారు.

ఇండియన్ పోస్ట్ గోల్డ్ కాయిన్ సర్వీసెస్ సమాచారం ప్రకారం  1947లో తులం రూ.88.62. 10 కిలోల బంగారం ధర ఢిల్లీ నుంచి ముంబైకి విమాన టికెట్ ధర కంటే తక్కువని తెలుస్తోంది.

స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత..  10 గ్రాముల బంగారం ధర దాదాపు 300 రెట్లు పెరిగింది. దేశ స్వాతంత్యం అనంతరం  బంగారం ధర గణనీయంగా పెరగడం ప్రారంభమైంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 88. నుంచి మొదలైన పసిడి జర్నీ పెట్టుబడి వస్తువుగా మారింది. దీంతో 1950 –  1960 మధ్య ముదుపరులకు దాదాపు 12% రాబడిని అందించింది.

1970లో, బంగారం ధర రూ 184లు ఉండగా.. 1980లో రూ. 1,330లు ఉంది. ఇక 1990లో రూ. 3,200లు ఉంది. ఇక 2000 నుండి 2010 మధ్యకాలంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. రూ. 4,400 నుండి 2010 లో 18,500 లకు చేరుకుంది. అలా మొదలైన పసిడి ధర పరుగు నేటికీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కరోనా సమయంలో బంగారం ధర అల టైం రికార్డ్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,530గా ఉంది. అంటే స్వాతంత్యం వచ్చిన ఏడాది నుంచి నేటి వరకూ దాదాపు 527 రెట్లు ఖరీదైనదిగా మారిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మనదేశంలో ప్రతి సంవత్సరం 700-800 టన్నుల బంగారాన్ని వినియోగిస్తున్నారు. అందులో 1 టన్ను భారతదేశంలో ఉత్పత్తి అవుతోంది. మిగిలిన బంగారం దిగుమతి అవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..