కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే గెలుపొందారు. 7 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
రాజకీయ ప్రవేశం..
విద్యార్థి దశలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభం.
గుల్బర్గా కాలేజీలో చదువుతున్న సమయంలో స్టూడెంట్ యూనియన్ నేతగా రాణించారు.
అనంతరం స్టూడెంట్ బాడీకి జనర్ సెక్రెటరీగా ఎన్నిక
గుల్బర్గా యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్ బీ పూర్తి
1969లో ఎంఎస్కే మిల్స్ ఎంప్లాయీస్ యూనియన్ కు లీగల్ అడ్వైజర్ గా
హేతుబద్దమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి, సంప్రదాయాలకు., మూడనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే మనిషిగా పేరొందారు
చదువునే రోజుల్లో కబడ్డీ, హాకి, క్రికెట్ వంటి క్రీడలపై ఆసక్తి కనబర్చేవారు
కాంగ్రెస్ లో చేరిక..
1969లోనే కాంగ్రెస్ పార్టీలో చేరిక
1972 నుంచి 2014 వరకు జరిగిన అసెంబ్లీ ప్లస్ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు.
తొలిసారిగా 1972లో గుర్ మిత్కల్ నియోజకవర్గం నుంచి గెలుపు, అనంతరం 1978, 1983, 1985, 1989, 1994, 1999, 2004 వరకు మళ్లీ గుర్ మిత్కల్ నియోజకవర్గం నుంచి గెలిచారు.
2008 అసెంబ్లీ ఎన్నికల్లో చితాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు.
లోక్ సభకు ఖర్గే..
2009 లోక్ సభ ఎన్నికల్లో ఖర్గే గల్బర్గ నుంచి పోటీచేసి విజయం సాధించి పార్లమెంట్లోకి తొలిసారిగా అడుగుపెట్టారు.
2014 లోక్ సభ ఎన్నికల్లో గుల్బర్గ నుంచి రెండో సారి విజయం
2014 జూన్ లో లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నియామకం
2019 లోక్ సభ ఎన్నికల్లో గుల్బర్గ నుంచి పోటీచేసి ఓటమిక
పదవులు..
1978లో తొలిసారిగా మంత్రి పదవి చేపట్టిన ఖర్గే
1980లో రెవెన్యూ మంత్రిగా రాష్ట్రంలో 400 ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు
1985లో అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు డిప్యూటీ నేతగా పనిచేశారు.
1990లో ఖర్గే రెవెన్యూ మంత్రిగా పనిచేసి రాష్ట్రంలో ఆగిపోయిన భూ సంస్కరణలను మళ్లీ ప్రారంభించారు. భూమిలేని వారికి భూములను పంపిణీ చేశారు.
1992-94 కాలంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు.
1994లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు.
1999, 2004 అసెంబ్లీ ఎన్నికల అనంతర సీఎం పదవి రేసులో ఖర్గే ఉన్నప్పటికీ చివరికి మంత్రి పదవులకే పరిమితమయ్యారు.
1999లో రాష్ట్ర హోం శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు
2004లో రవాణా శాఖా మంత్రిగా పని చేసిన అనుభవం.
2005లో కర్నాటక కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం
2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి. ఖర్గే తొమ్మిదోసారి వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు.
అనంతరం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియామకం అయ్యారు.
2020 లో రాజ్యసభకు కర్నాటక నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక
2021 ఫిబ్రవరి 12 న రాజ్య సభలో ఖర్గే ప్రతిపక్ష నేతగా నియమింపబడ్డారు
సామాజిక సేలు..
తాను బుద్దిజంను అనుసరిస్తానని చెప్పుకున్న ఖర్గే , సిద్ధార్థ్ విహార్ వ్యవస్థాపక ఛైర్మన్ గా వ్యవహరించారు. ఈ సంస్థ గుల్బర్గలో బుద్ధ విహార్ ను నిర్మించింది. సాంస్కృతిక కార్యక్రమాల జరిగే చౌడయ్య మెమోరియల్ హాల్ అభివృద్ధిలో సైతం పాలుపంచుకున్నారు. ఖర్గే భార్య పేరు రాధాబాయ్ ఖర్గే. వీరికి ఐదుగురు సంతానం.