Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన భూగర్భ సొరంగం..

|

Feb 13, 2022 | 9:32 AM

Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడంలో 9 మింది కార్మికులు శిథిలాలలో చిక్కుకున్నారు.

Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన భూగర్భ సొరంగం..
Madhyapradesh
Follow us on

Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడంలో 9 మింది కార్మికులు శిథిలాలలో చిక్కుకున్నారు. వీరిలో ఐదుగురిని అధికారులు రక్షించగా.. మిగతా వారిని బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు స్టేట్ డిజాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్. కాగా, ఈ ఘటన కట్ని జిల్లాలోని స్లీమనాబాద్ వద్ద బర్గి భూగర్బ కాలువ నిర్మాణంలో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భూగర్భ కాలువ నిర్మాణ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులు సొరంగంలో ఇరుక్కున్నారు. ప్రమాదంపై సమాచారాం అందుకున్న ఎస్‌డిఆర్ఎఫ్ బృందం.. వెంటనే రంగంలోకి దిగింది. కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. శిథిలాల్లో చిక్కుకున్న 9 మంది కార్మికుల్లో ఐదుగురిని రక్షించగా. మిగిలిన నలుగురిని కూడా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్, పోలీసు యాంత్రంగం అంతా అక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. స్లీమనాబాద్‌లో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఘటనపై జిల్లా అధికారులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిచాలని, వీలైనంత త్వరగా అందరినీ రక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.

Also read:

Animals Viral Video: అమెరికాలో వింత ఘటన బ్రతికే ఉన్నా.. చనిపోయినట్లుగా జీవశ్ఛవాలుగా మూగ జీవులు..(వీడియో)

NEET UG PG counselling 2021: నీట్‌ యూజీ, పీజీ కౌన్సెలింగ్ 2021 పై MCC కీలక నిర్ణయం..వెంటనే ఆ తేదీలను సవరించండి!

Karnataka Hijab Row: డ్రెస్ కోడ్ సమానత్వాన్ని సూచిస్తుంది.. అయితే ఇది అందరికీ వర్తించాలంటున్న మేధావులు..!