Social Media: ఇండియాలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్..? ఎంతవరకు సాధ్యం..? అసలు కుదిరే పనేనా..?

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో మైనర్లు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించాయి. ఇంకా చాలా దేశాలు ఇదే నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి జనాభా పరంగా అతి పెద్ద దేశమైన ఇండియాలో అది సాధ్యమా..? కాదా..? అనే చర్చ జరుగుతోంది.

Social Media: ఇండియాలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్..? ఎంతవరకు సాధ్యం..? అసలు కుదిరే పనేనా..?
Social Media

Updated on: Dec 20, 2025 | 8:44 PM

ఇప్పటికే పలు దేశాల్లో మైనర్లకు యాక్సెస్ లేకుండా సోషల్ మీడియాపై బ్యాన్ విధించారు. ఆస్ట్రేలియాలో మైనర్లు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వాడకుండా నిషేధించారు. అలాగే పలు దేశాలు కూడా ఆస్ట్రేలియా బాటలోనే సోషల్ మీడియాను మైనర్లు వాకుండా నిషేధం అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో కూడా అదే రూల్ తీసుకురావాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరి ఇండియాలో ఇది సాధ్యమైనా..? పిల్లలు వాడకుండా బ్యాన్ విధించాల్సిన అవసరముందా? అనే చర్చ జరుగుతోంది.

ఆస్ట్రేలియాలో వీటిపై నిషేధం

ఆస్ట్రేలియాలో ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, రెడ్‌ఇట్, స్పాప్‌ఛాట్, టిక్‌టాక్, యూట్యూబ్, ట్రెడ్స్, ట్విచ్, కిక్ అనే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ 16 ఏళ్లలోపు పిల్లలు వాడకుండా నిషేధించారు. ఆ వయస్సు పిల్లలకు సోషల్ మీడియాలోకి యాక్సెస్ ఇస్తే సంస్థలకు భారీగా జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా వారికి నోటీసులు పంపించనున్నారు. అయితే ఈ నిర్ణయంపై ఇప్పటికే సోషల్ మీడియా ఏజెన్సీలు కోర్టులను సంప్రదించాయి. ఇక ఆస్ట్రేలియా తర్వత న్యూజిలాండ్ కూడా ఇదే నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇక డెన్మార్మ్, నార్వే, ఐర్లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్ వంటి దేశాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.

ఇండియాలో సాధ్యమా..?

ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన ఇండియాలో సాధ్యమైనా అని చర్చ జరుగుతోంది. అయితే భారతదేశ జనాభా, వినియోగదారుల కారణంగా సోషల్ మీడియాను నిషేధించడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా రాజ్యంగం, చట్టపరంగా కూడా సవాళ్లు ఎదురుకావొచ్చని చెబుతున్నారు. యువత, పౌర సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చే అవకాశముంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఉంది. ప్రతీఒక్కరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్చ రాజ్యాంగం కల్పించింది. ఇప్పుడు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే అంతర్జాతీయంగా ప్రతీకూల ప్రభావం చూపించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. దీని కంటే అశ్లీల, ఉపయోగం లేని కంటెంట్ యాక్సెస్ చేయకుండా చర్యలు తీసుకోవడం, మంచి కోసం సోషల్ మీడియా ఉపయోగించేలా అవగాహన కల్పించడం వల్ల లాభం ఉంటుందని అంటున్నారు.